Rain In Hyderabad : రాగల మూడు రోజుల్లో హైదరాబాద్‌లో వర్షాలు
ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

rain in Hyderabad
rain in Hyderabad : రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‌లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నవంబర్ 4వ తేదీ వరకు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. సాయంత్రం, రాత్రి సమయాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Chennai: చెన్నైని వదలని భారీ వర్షాలు
కాగా, మంగళవారం మధ్యాహ్నం నగరం వ్యాప్తంగా తేలికపాటి వర్షం కురిసింది. 4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాబోయే మూడు రోజుల్లో కనిష్ఠంగా 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, గరిష్ఠంగా 28 నుంచి 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.