Newlyweds
Newlyweds: నిజామాబాద్ జిల్లాలో నవదంపతులు ఆత్మహత్యకు యత్నించారు. జిల్లాలోని పచ్చలనడికుడ గ్రామంలో దంపతులిద్దరూ విషం సేవించారు. వీరిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాగా జూన్ 13 తేదీన వీరికి వివాహం జరిగింది. వివాహం జరిగి పది రోజులు కూడా కాకముందే నవదంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భార్య భర్తల మధ్య గొడవ కారణంగానే ఈ విధంగా చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.