IKEA Hyderabad: అనుకున్నది ఒక్కటి.. అయ్యిందొకటి.. ఐకియా స్టోర్ అనుభవం షేర్ చేసుకున్న మహిళ
ఒక వస్తువు కొనడానికి దుకాణానికి వెళ్లి దాంతో పాటు చాలా వస్తువులు కొనేస్తుంటాం. ఓ మహిళ కొనాలనుకున్న వస్తువు తప్ప వేరే వస్తువుల కొని తన కన్నా పొడవైన బిల్లును చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసింది.

Woman post viral
IKEA Hyderabad Woman post viral : ఒక వస్తువు కోసం వెళ్లి మరో వస్తువు కొనడం చాలామందికి అలవాటు ఉంటుంది. అయితే ఐకియాకి వెళ్లిన ఓ మహిళ పొడవాటి బిల్లు అయితే చేసింది. అందులో కొనాలి అనుకుని వెళ్లిన వస్తువుని మాత్రం మర్చిపోయింది. ఈ విషయాన్ని సరదాగా ట్విట్టర్‌లో షేర్ చేసింది.
ఆడవారికి షాపింగ్ అంటే ఎంతో ఇష్టం. ఐకియా లాంటి స్టోర్‌కి వెళ్తే ఆగగలరా? ఎప్పుడూ రద్దీగా ఉండే ఐకియాకి వెళ్లిన సమీర అనే మహిళ తన ఎక్స్‌పీరియన్స్‌ను ట్విట్టర్ ఖాతాలో (@sameeracan) సరదాగా షేర్ చేసుకున్నారు. సమీర గోవాలో ‘గోల్డ్ స్పాట్’ అనే కేఫ్‌ను రన్ చేస్తున్నారు. తన స్టోర్ కోసం ఒక ల్యాంప్ కొనాలని స్టోర్‌కి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత మిగిలిన వస్తువుల పట్ల ఆకర్షితురాలై అసలు కొనాల్సిన ల్యాంప్ సంగతి మర్చిపోయారట. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. ‘దీపం కొనడానికి ఐకియాకి వెళ్లాను. దీపం కొనడం మర్చిపోయాను’ అంటూ తన కంటే పొడవైన బిల్లుతో ఫోజులిచ్చిన ఫోటోను సమీర ట్విట్టర్‌లో షేర్ చేశారు.
Chandramukhi 2 : డబ్బింగ్ చెబుతున్న టైంలో చంద్రముఖి ఎంట్రీ.. భయపడ్డ వడివేలు.. వీడియో వైరల్
సమీర పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెట్టారు. ‘కొన్ని చోట్లకి వెళ్లినపుడు అలాగే జరుగుతుందని’.. ‘ధనవంతుల సమస్యలు’ .. అని అభిప్రాయపడ్డారు. సమీర లాస్ట్ వీక్ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Went to IKEA to buy ONE lamp.
Forgot to buy the lamp. pic.twitter.com/drnz1hi7wb— Sameera (@sameeracan) August 10, 2023