Chandramukhi 2 : డబ్బింగ్ చెబుతున్న టైంలో చంద్రముఖి ఎంట్రీ.. భయపడ్డ వడివేలు.. వీడియో వైరల్
చంద్రముఖి 2 డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టుకుంది. ఈక్రమంలోనే యాక్టర్ వడివేలు డబ్బింగ్ చెబుతున్న సమయంలో..

Vadivelu start his dubbing for Raghava Lawrence Kangana Ranaut Chandramukhi 2
Chandramukhi 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన హారర్ కామెడీ చిత్రం ‘చంద్రముఖి’. 18 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. అయితే ఈ సీక్వెల్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా తెరకెక్కుతుంది. ఇక మొదటి పార్ట్ లో చంద్రముఖిగా జ్యోతిక కనిపిస్తే, ఇప్పుడు కంగనా రనౌత్ (Kangana Ranaut) చంద్రముఖిగా బయపెట్టబోతుంది. ఈ సీక్వెల్ లో వడివేలు, రావు రమేష్, రాధికా, లక్ష్మి మీనన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీ చిత్రీకరణ మొత్తం పూర్తి అయ్యి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈక్రమంలోనే డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. ఇక డబ్బింగ్ స్టూడియోలో వడివేలు తన డబ్బింగ్ చెబుతున్న సమయంలో ఒక్కసారిగా చంద్రముఖి వాయిస్ వచ్చింది. “ఎవరది నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ వస్తావు” అని చంద్రముఖి వాయిస్ రాగానే వడివేలు భయపడిపోయి.. “డబ్బింగ్ కోసం వచ్చాను మేడం” అంటూ బదులిచ్చాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ కామెడీ వీడియోని షేర్ చేసింది చిత్ర యూనిట్.
Vishwak – Neha : నిన్న విజయ్, సమంత.. నేడు విశ్వక్, నేహశెట్టి.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్..
View this post on Instagram
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చంద్రముఖి 1ని డైరెక్ట్ చేసిన పి వాసు ఈ సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన మొదటి సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తమిళ్, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. కాగా ఆల్రెడీ చంద్రముఖి సీక్వెల్ అంటూ అప్పటిలో వెంకటేష్ ‘నాగవల్లి’ సినిమాని తీసుకు రాగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. మరి ఈ సీక్వెల్ ఎలా అలరిస్తుందో చూడాలి.