MLA Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జడ్జిమెంట్ లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జడ్జిమెంట్ సమయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి సాక్షాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలం అయిందని హైకోర్టు పేర్కొంది.

High Court
MLA purchase case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జడ్జిమెంట్ సమయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ముఖ్యమంత్రికి సాక్షాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలం అయిందని హైకోర్టు పేర్కొంది.
దర్యాప్తు సమాచారాన్నిసీఎంకు చేరవేయడం తీవ్ర అభ్యంతరకర విషయమని కోర్టు అభిప్రాయపడింది. ఆధారాలన్నీ మీడియా, ప్రజలకు వెళ్లిపోయాయని తెలిపింది.
దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని పేర్కొంది. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాత ఇన్వెస్టిగేషన్ లాగా అనిపించడం లేదని అభిప్రాయపడింది. బీజేపీ పిటిషనర్ మెయింటెనబుల్ కాకపోవడంతో పిటిషన్ డిస్మిస్ చేశామని వెల్లడించింది. నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను కోర్టు పరిగణలోకి తీసుకుంది. జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసింది.
TRS MLA Purchase Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతి
సిట్ చేసిన దర్యాప్తును హైకోర్టు రద్దు చేసింది. సిట్ ను రద్దు చేస్తూ కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఎఫ్ఐఆర్ 455/2022 సీబీఐకి బదిలీ చేసింది. కేసు సీబీఐకి ఇవ్వడానికి కోర్టు 45 అంశాలు ప్రస్తావించింది. 25 కేసుల జడ్జిమెంట్లను కోడ్ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సిట్ ఉనికిని ప్రశ్నించింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పరిధి దాటి వ్యవహరించిందని తెలిపింది. కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్ చేశారని పేర్కొంది. సీఎం ప్రెస్ మీట్ ను హైకోర్టు ఆర్డర్ లో చేర్చింది.