Police Recruitment Exams : పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) కీలక విషయాన్ని తెలిపింది. పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. టీఎస్ పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి తేదీలను మార్పు చేసింది.

Police Recruitment Exams : పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు

Police Recruitment Exams

Updated On : January 13, 2023 / 5:36 PM IST

Police Recruitment Exams : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) కీలక విషయాన్ని తెలిపింది. పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. టీఎస్ పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి తేదీలను మార్పు చేసింది. నాలుగు పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఎస్ఐ(ఐటీ), ఏఎస్ఐ (ఫింగర్), కానిస్టేబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పు చేశారు.

TSLPRB: పోలీస్ రిక్రూట్‌మెంట్.. ముగిసిన ఫిజికల్ టెస్టులు.. 1,11,209 మంది అర్హత

ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30న నిర్వహించనున్నారు. మార్చి 12న జరగాల్సిన ఎస్ఐ(ఐటీ) పరీక్ష 11వ తేదీకి మార్చారు. ఏఎస్ఐ(ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి12 నుంచి ఏప్రిల్ 11వ తేదీకి మార్చారు. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్(ఐటీ) పరీక్ష 30న నిర్వహించనున్నారు.