మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి బెదిరింపులు.. ఇంటిని కూల్చిన వ్యక్తులు
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి బెదిరింపుల ఘటన రాజకీయంగా సంచలనం రేపుతుంది. అద్దెకు ఇచ్చిన ఇంటిని

JC Diwakar Reddy
JC Diwakar Reddy: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి బెదిరింపుల ఘటన రాజకీయంగా సంచలనం రేపుతుంది. అద్దెకు ఇచ్చిన ఇంటిని వ్యక్తులు కూల్చివేశారు. సాహితీ లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్ తో జూబ్లీహిల్స్ లో ఇంటి లీజు వ్యవహారంలో ఏడాది క్రితం నుంచి తగాదాలు ఉన్నాయి. అయితే, జేసీ తన ఇంటిని స్వాతిక్ కు అద్దెకు ఇవ్వగా.. సాత్విక్ అదే ఇంటిని జేసీకి తెలియకుండా వేరొకరికి అద్దెకు ఇచ్చారు. అద్దెకు తీసుకున్న వ్యక్తులు జేసీ ఇంటిని కూల్చివేసి వేరే నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ దివాకర్ రెడ్డి, అతని మేనేజర్ జగదీష్ లు వారిని ప్రశ్నించగా.. రాజీవ్ సాల్మన్ అనే వ్యక్తి, అతడి అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి, మేనేజర్ జగదీశ్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: జన్వాడ ఫామ్‌హౌజ్ పార్టీలో పాల్గొన్న అందరి పేర్లను బయటపెట్టాలి : బండి సంజయ్