Three killed in Godavari river : గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి
భద్రాచలంలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి చెందారు.

Three Killed In Godavari River
Three killed in Godavari river : భద్రాచలంలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. నదిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, బాలుడు ఉన్నారు. మృతులు భద్రాచలంలోని అయ్యప్పకాలనీ వాసులుగా గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన వారు గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. నదిలో స్నానం చేస్తున్నక్రమంలో ఐదుగురు కూడా గల్లంతయ్యారు. నదిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు భద్రాలచం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయ్యప్ప కాలనీలో విషాదం నెలకొంది. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బోరును విలిపిస్తున్నారు.
గోదావరి వరద ఉదృతి తగ్గింది. గోదావరిలో వరద చాలా తక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో ఒకే టుంబానికి చెందిన వారు. లోతైన ప్రాంతానికి వెళ్లి దిగారు. ఘటనాస్థలిలో విషాధచాయలు అలుమున్నాయి.