Telangana Omicron : సిరిసిల్ల జిల్లాలో మూడు ఒమిక్రాన్ కేసులు..టిమ్స్ ఆసుపత్రికి తరలింపు

ముగ్గురికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వీరిని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు...పదిరోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేస్తున్నట్లు పంచాయితీ తీర్మానం...

Telangana Omicron : సిరిసిల్ల జిల్లాలో మూడు ఒమిక్రాన్ కేసులు..టిమ్స్ ఆసుపత్రికి తరలింపు

Omicron Tg

Updated On : December 27, 2021 / 2:03 PM IST

Omicron Cases Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల ప్రజలు ఒమిక్రాన్ వైరస్ తో భయపడిపోతున్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన సంగతి తెలిసిందే. ఇతడిని అధికారులు అప్రమత్తమై…అతడిని హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే..ఇటీవలే ఆ వ్యక్తి కుటుంబం కరోనా వైరస్ బారిన పడ్డారు.

Read More : Covid Vaccine: వ్యాక్సిన్ వేయించుకోమన్నందుకు పోలీస్‌ అధికారి చెయ్యి విరగ్గొట్టిన వ్యక్తి

తల్లి, భార్యతో పాటుగా బాధితుడి మిత్రుడికి…కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వారి శాంపిళ్లను తీసుకుని జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలకు పంపారు. 2021, డిసెంబర్ 27వ తేదీ సోమవారం వారికి సంబంధించిన పరీక్షల రిపోర్ట్స్  వచ్చాయి. వారి ముగ్గురికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వీరిని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే గ్రామాన్ని పదిరోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేస్తున్నట్లు పంచాయితీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

Read More : Omicron World : ప్రపంచంపై ఒమిక్రాన్ పంజా..ఆస్ట్రేలియాలో తొలి మరణం!

తెలంగాణలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో బాధితుల సంఖ్య 44కి చేరింది. కొత్తగా ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 2వందల 48 మంది శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ RTPCR టెస్టులు చేయగా ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. తెలంగాణలో ఒమిక్రాన్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 10 మంది కోలుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 11వేల 493 మంది ప్రయాణికులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.