City Bus QR Code : సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్… క్యాష్ తోపాటు క్యాష్ లెస్ టికెట్ విధానం

అయితే ఈ ఏడాదిలోనైనా సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్ జారీ విధానాన్ని అమలు చేసే అంశాన్ని సీరియస్ గానే తీసుకున్నట్లు చెబుతున్నారు.

City Bus QR Code : సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్… క్యాష్ తోపాటు క్యాష్ లెస్ టికెట్ విధానం

QR Code City Bus

Updated On : June 16, 2023 / 11:48 AM IST

Cash And Cashless Ticket : హైదరాబాద్ (Hyderabad) లో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసే విధంగా ఆర్టీసీ (TSRTC) యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిపై గత ఏడాదిలోనే నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని భావించారు. కానీ, కొన్ని సాంకేతిక కారణాలతో కొంత ఆలస్యమైనట్లు వెల్లడించారు.

అయితే ఈ ఏడాదిలోనైనా సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్ జారీ విధానాన్ని అమలు చేసే అంశాన్ని సీరియస్ గానే తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా జిల్లాలకు తిరిగే సూపర్ లగ్జరీ బస్సుల్లో నగదుతోపాటు ఫోన్ పే క్యూ ఆర్ కోడ్ ద్వారా టికెట్ జారీ ప్రక్రియ రెండు విధాలుగా కొనసాగుతున్నాయి.

Minister KTR : గ్రేటర్ హైదరాబాద్ లో సరికొత్త పాలన.. వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

అదే విధంగా సిటీ బస్సుల్లో అమలు చేయాలన్న ఆలోచనతోనే ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు తిరుగుతున్న పుష్పక్ ఏసీ బస్సుల్లో అమలు చేస్తున్నారు.