Minister KTR : గ్రేటర్ హైదరాబాద్ లో సరికొత్త పాలన.. వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు పాలన వికేంద్రీకరణలో భాగంగా జీహెచ్ఎంసీలో వార్డు పాలన విధానాన్ని ప్రవేశపెట్టింది.

Minister KTR : గ్రేటర్ హైదరాబాద్ లో సరికొత్త పాలన.. వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ktr

GHMC Ward Office : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సరికొత్త పాలన అందుబాటులోకి వచ్చింది. జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాలు అందుబాటులోకి అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్… కాచిగూడ వార్డు కార్యాలయాన్ని ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ బోర్డ్ ఎండీ ధన కిషోర్, స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో మంత్రులు, మేయర్, శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లు తమ తమ ప్రాంతాల్లోని వార్డు కార్యాలయాలను ప్రారంభించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు పాలన వికేంద్రీకరణలో భాగంగా జీహెచ్ఎంసీలో వార్డు పాలన విధానాన్ని ప్రవేశపెట్టింది. వార్డు పరిపాలన అధికారితోపాటు మొత్తంగా వార్డులో 10మంది చొప్పున ఇంజనీరింగ్, ఎంటోమాలజీ, యూబీడీ, యూసీడీ, టౌన్ ప్లానింగ్ శానిటేషన్, విద్యుత్, జలమండలి, రిసెప్షనిస్ట్ ఉండనున్నారు.

AAP Offer to Congress: కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోటీ చేయమంటూ ప్రకటన

ఈ సందర్భంగా కమిషనర్ జీహెచ్ఎంసీ లోకేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకే వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలోని ఏ మెట్రోపాలిటన్ సిటీలో లేని విధంగా ఈ వార్డు ఆఫీసులో పనిచేస్తాయని చెప్పారు. హెల్త్ మరియు పోలీస్ విభాగాల నుండి కూడా ఒక అధికారుల నియామకం కోసం ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. మొత్తం ఐదు విభాగాలు వార్డు కార్యాలయంలో పని చేయనున్నాయని వెల్లడించారు.

సర్కిల్ ఆఫీస్ జోనల్ ఆఫీస్ మరియు హెడ్ ఆఫీస్ లకు వెళ్లకుండా పౌరులు వార్డు కార్యాలయంలో సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. ఏ ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యలు కూడా ఇక్కడ స్వీకరించబడతాయని పేర్కొన్నారు. 150 వార్డులకు గానూ 132 వార్డు కార్యాలయాలు శుక్రవారం ప్రారంభమవుతున్నాయని తెలిపారు.