Amit Shah : తెలంగాణలో ఈరోజు అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇలా..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇక నేతలంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో అధికారం కోసం పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ దిశగా తెలంగాణలో ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా బీజేపీ పెద్దలు తెలంగాణకు క్యూ కట్టారు.

Amit Shah : తెలంగాణలో ఈరోజు అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇలా..

Amit Shah Telangana Tour

Updated On : October 10, 2023 / 2:11 PM IST

Amit Shah Telangana Tour : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇక నేతలంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో అధికారం కోసం పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ దిశగా తెలంగాణలో ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా బీజేపీ పెద్దలు తెలంగాణకు క్యూ కట్టారు.  ప్రధాని మోదీ పర్యటన, నడ్డా, తరువాత అమిత్ షా పర్యటన రాష్ట్రంలో రాజకీయం వేడిక్కింది. దీంట్లో భాగంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు.

ఆయన పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. చిన్నపాటి మార్పులు చోటుచేసుకున్నా పర్యటన మాత్రం జరగనుంది. దీని కోసం తెలంగాణ నేతలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. షా పర్యటనలో భాగంగా ఆయన షెడ్యూల్ ఇలా ఉంది..

అమిత్ షా నాగపూర్ నుంచి ఆదిలాబాద్ వెళ్లనున్నారు. దీనికోసం నాగపూర్ నుంచి బయలుదేరి మధ్యాహ్నాం 1.50 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఆయన్ని బీజేపీ నేతలు ఘన స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి మ.2.35గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ చేరుకుంటారు. మ.3.00గంటలకు ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. సభలో ప్రసంగిస్తారు.

ఇక దూకుడే.. ఎన్నికల రణరంగంలోకి కేసీఆర్.. ఎప్పుడు ఏ నియోజకవర్గంలో

సాయంత్రం 5.05 గంటలకే తిరిగి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5.20 గంటలకు ఐటీసీ కాకతీయలో అమిత్ షా బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 6.00గంటలకు ఇంపీరియల్ గార్డెన్ చేరుకుంటారు. అక్కడ6.20 గంటల నుంచి 7.20 వరకు భేటీ కొనసాగుతుంది. రాత్రి 7.40 గంటలకు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రెండు గంటలపాటు ఈ సమావేశం కొనసాగుతుంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చించే అవకాశమున్నట్లుగా సమాచారం.