గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో షాక్..పార్టీని వీడనున్న టీపీసీసీ కోశాధికారి

Guduru NarayanaReddy considering resigning Congress : గ్రేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. టీపీసీసీ కోశాధికారిగా ఉన్న గూడూరు నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఆయన బీజేపీ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది.
దీనికి సంబంధించి ఇప్పటికే కాషాయ పార్టీ నేతలు నారాయణరెడ్డితో టచ్‌లో ఉన్నట్లు సమాచారమందుతోంది. అయితే నారాయణరెడ్డిని పార్టీ మారకుండా ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ఏకంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగి బుజ్జగించే పనిలో ఉన్నారు.
తాజాగా మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్… బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న విక్రమ్‌గౌడ్ బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. 2020, ఆయన కమలం తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడారు. తమకు పదవులు ఇవ్వలేదని, తాము చెప్పిన వారికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని మనస్తాపంతో పార్టీని వీడారు. గతంలో కాంగ్రెస్ తరపున గెలిచి జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేసిన బండా కార్తీకా రెడ్డి ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు.