TPCC : నేడు పీసీసీ కార్యవర్గ సమావేశం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం శనివారం జరుగనుంది. ఈ సమావేశంలో హుజురాబాద్ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చ జరుగనుంది. హుజురాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖను బరిలో దింపే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

TPCC : నేడు పీసీసీ కార్యవర్గ సమావేశం

Tpcc

Updated On : August 14, 2021 / 10:49 AM IST

TPCC : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం శనివారం జరుగనుంది. ఈ సమావేశంలో హుజురాబాద్ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చ జరుగనుంది. హుజురాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖను బరిలో దింపే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మొన్నటివరకు కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి పార్టీని విడటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై ఈ రోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హుజూరాబాద్ రేసులో కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ , ఓ ఎన్ఆర్ఐ ఉన్నట్లు సమాచారం.