Hyderabad Traffic Restrictions : వినాయక నిమజ్జనం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో 25వ తేదీన ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపు వెళ్లొద్దు!
Hyderabad Traffic Restrictions : వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచి శనివారం ఉదయం 10గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి.
Hyderabad Traffic Restrictions
Hyderabad Traffic Restrictions : హైదరాబాద్‌లో గణనాథుల నిమజ్జనోత్సవానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈనెల 25 (శుక్రవారం) ఉదయం నుంచి గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జంట నగరాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్, ఇతర చెరువుల వద్దకు నిమజ్జనానికి రానున్నాయి. ఈ మహాఘట్టంకోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏకంగా 30వేల మంది పోలీసులు, డ్రోన్లు, 10వేల సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.
వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచి శనివారం ఉదయం 10గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి. భారీ ఎత్తున జరిగే వినాయక శోభాయాత్ర కోసం శుక్రవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉంటాయి. చెరువుల దగ్గర క్రేన్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ బోట్లు, గజ ఈతగాళ్లు, మెడికల్ క్యాంపులను కూడా అధికారులు సిద్ధం చేశారు.
బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన ఊరేగింపు చార్మినార్, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, బషీర్ బాగ్, లిబర్టీ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, సీవీఎన్ఆర్ మార్గ్‌వైపు సాగనుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వేలాది గణేశ్ విగ్రహాలు అనుబంధ మార్గాల్లో ప్రయాణించి ప్రధాన ఊరేగింపులో కలవనున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ వాహనాలను దారి మళ్లించడంతోపాటు.. ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా బాలాపూర్ గణపయ్య మండపం నుంచి ప్రారంభమయ్యే ప్రధాన నిమజ్జన ఊరేగింపు గణేశ్‌చౌక్, డైమండ్ హోటల్ వై జంక్షన్, కట్టమైసమ్మ ఆలయం, గుర్రం చెరువు మీదుగా కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్, ఎంబీఎన్ఆర్ ఎక్స్‌రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఆలియాబాద్, నాగులచింత, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ ఎక్స్‌రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా అంబేడ్కర్ విగ్రహం వైపు సాగుతుంది. అక్కడి నుంచి ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ అంటే నెక్లెస్ రోడ్వైపు నిమజ్జన వాహనాలు వెళ్లనున్నాయి.
సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు సంగీత్ థియేటర్ మీదుగా సికింద్రాబాద్ జోన్లోకి ప్రవేశించి ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్, రాణిగంజ్, కర్బలా మైదాన్, సొనాబాయి మసీదు, సెయిలింగ్ క్లబ్, ట్యాంక్‌బండ్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ చేరనున్నాయి. చిలకలగూడ ఎక్స్‌రోడ్స్ నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ హాస్పిటల్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్, ఖైరతాబాద్ జోన్, మింట్ లేన్, నారాయణగూడ ఎక్స్‌రోడ్ మీదుగా లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.
గోల్కొండ వైపు నుంచి వచ్చే వాహనాలకు రంగా మహల్ వై జంక్షన్, శివాజీ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్ ఐలాండ్, ఉస్మాన్‌గంజ్, శంకర్‌బాగ్, సీనా హోటల్, కేర్ హాస్పిటల్స్ సమీపంలోని మిడాస్ యూటర్న్, నాంపల్లి, ఎంజే బ్రిడ్జి, పురానాపూల్ ఎక్స్‌రోడ్, టోప్‌ఖానా మసీదు, ఫీల్‌ఖానా, అలాస్కా జంక్షన్, దారుస్సలాం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. దీంతో పాటు పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయనున్నారు. గణేశ్ విగ్రహాలను తరలించే వాహనాలు మినహా ప్రధాన ఊరేగింపు మార్గంలో ఇతర వాహనాలను అనుమతించరు.
ఖైరతాబాద్ జోన్లో అమీర్‌పేట్ వై జంక్షన్, పంజాగుట్ట ఎక్స్‌రోడ్, మోనప్ప జంక్షన్, వీవీ స్టాచ్యూ, నెక్లెస్ రోడ్, రవీంద్ర భారతి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, మింట్ లేన్, ట్యాంక్‌బండ్ ఫ్లైఓవర్, అంబేడ్కర్ ఓల్డ్ స్టాచ్యూ, ప్రింటింగ్ ప్రెస్, నాంపల్లి టీ జంక్షన్, హిమాయత్‌నగర్ వై జంక్షన్, రాంగ్మహల్ వై జంక్షన్ తదితర ప్రాంతాల్లో డైవర్షన్లు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. వీటితో పాటు ఆర్టీసీ బస్సులను సైతం మళ్లించనున్నారు.
ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్/నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయి. వాహనదారులు ఖైరతాబాద్, తెలుగుతల్లి, లిబర్టీ, MJ మార్కెట్, GPO వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
నారాయణగూడ, RTC X రోడ్స్, ట్యాంక్‌బండ్, NTR మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ట్రాఫిక్ రద్దీని బట్టి పోలీసులు ఆంక్షల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచిస్తున్నారు.
#HYDTPinfo
🚨 TRAFFIC NOTIFICATIONCommuters are requested to take note of the traffic regulations being implemented in connection with the Ganesh Immersion Procession on 25-09-2026.
The notification includes important information regarding:
🔹 Procession Routes
🔹 Parking for… pic.twitter.com/6kR4ylVssa— Hyderabad Traffic Police (@HYDTP) September 23, 2026
