Traffic Restrictions Hyderabad : రేవంత్ ప్రమాణ స్వీకారం.. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఏఏ ప్రాంతాల్లో అంటే?

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Traffic Restrictions Hyderabad : రేవంత్ ప్రమాణ స్వీకారం.. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఏఏ ప్రాంతాల్లో అంటే?

Traffic Alert Hyderabad

Updated On : December 7, 2023 / 9:16 AM IST

Revanth Reddy : తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల రాజకీయ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు పాల్గోనున్నారు. ఇందుకోసం ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియం వైపు ప్రాంతాల్లో, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. గురువారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర అదనపు పోలీసు (ట్రాఫిక్) కమిషనర్ జి. సుదీర్ బాబు తెలిపారు.

Also Read : Revanth Reddy : అధికారిక కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్ రెడ్డి.. చివరికి అధికారులు ఏం చేశారంటే?

– ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ (పబ్లిక్ గార్డెన్) నుంచి వచ్చే ట్రాఫిక్ బషీర్ బాగ్ బాబు జగ్జీవన్ రాం (బీజేఆర్) విగ్రహం కూడలివైపు అనుమతించరు. ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద నాంపల్లి, చాపెల్ రోడ్డు వైపు పంపిస్తారు.
– సుజాత పబ్లిక్ స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం వైపు వచ్చే ట్రాఫిక్ ను స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి స్టేషన్ వైపునకు పంపిస్తారు.
– బషీర్ బాగ్ కూడలి నుంచి బీజేఆర్ కూడలి వైపు వచ్చే ట్రాఫిక్ కు ఎంట్రీ ఉండదు. బషీర్ బాగ్ ప్లై ఓవర్ కూడలి నుంచి కింగ్ కోఠి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రహదారులపై పంపిస్తారు.
– గన్ ఫౌండ్రి ఎస్బీఐ నుంచి బీజేఆర్ కూడలి వైపు ట్రాఫిక్ ను ఎస్బీఐ వద్ద చాపెల్ రోడ్డువైపు మళ్లిస్తారు.
– పంజాగుట్ట, వి.వి. విగ్రహం కూడలి, రాజీవ్ గాంధీ విగ్రహం, నిరంకారి, పాత సైపాబాద్ ఠాణా, లక్డీ కాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీసు కాంప్లెక్స్, బషీర్ బాగ్, బీజేఆర్ విగ్రహం కూడలి, ఎస్బీఐ గన్ ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్, ఏఆర్ పెట్రోల్ బంక్, లిబర్టీ, హిమాయత్ నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్, హైదర్ గూడ కూడళ్ల వైపు వెళ్లకుండా ఉండాలని పోలీసులు సూచించారు.
– రవీంద్రభారతి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎల్బీ స్టేడియం ప్రధాన గేటు ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద డైవర్షన్ తీసుకోవాలి. నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది.
– ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Also Read : Bandi Sanjay : బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్? అందుకోసమేనా