Nizamabad: విషాధ ఘటన.. ఏడాది కుమార్తెకు నిప్పంటించి ఆత్మహత్య చేసుకున్న తల్లి..
Telangana - Nizamabad : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏడాది కుమార్తెకు నిప్పంటించిన ఓ తల్లి తాను ఆత్మహత్య చేసుకుంది.
Tragic Incident In Nizamabad Mother And Daughter Commit Suicide
Nizamabad: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏడాది కుమార్తెకు నిప్పంటించిన ఓ తల్లి తాను ఆత్మహత్య చేసుకుంది.
Also Read : తెలంగాణ ప్రభుత్వం బిగ్ డెసిషన్.. ఆ ప్రాంతాల్లో ప్లాస్టిక్ పూల విక్రయాలు నిషేధం.. కారణాలు ఇవే..
భీంగల్‌కు చెందిన కీర్తన (26)కు ధర్పల్లి మండలం గోవింద్‌పల్లి గ్రామానికి చెందిన ప్రదీప్‌తో నాలుగేళ్ల కింద వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. చిన్న కూతురు సాన్వీ(1) గ్రహణం మొర్రితో బాధపడుతోంది. ఆరు నెలల కిందట ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ చేయించినా వ్యాధి నయం కాలేదు. తన బిడ్డ గ్రహణం మొర్రి సమస్యకు కారణం తానేనని మనస్థాపానికి గురైన కీర్తన బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో తలుపులు వేసుకొని కూతురిపై పెట్రోల్ పోసి తాను నిప్పంటించుకుంది.
స్థానికులు తలుపులు బద్దలు కొట్టి కీర్తనను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. సాన్వీని చికిత్స నిమిత్తం హైదారాబాద్ తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయింది. భర్త ప్రదీప్ ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.
