Jeevan Reddy : చంద్రబాబు పెంచిన లిల్లీపుట్ రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పెంచిన లిల్లీపుట్ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.

Jeevan Reddy : చంద్రబాబు పెంచిన లిల్లీపుట్ రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Jeevan

Updated On : September 9, 2021 / 1:26 PM IST

Jeevan Reddy fired Revanth Reddy : టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పెంచిన లిల్లీపుట్ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి.. రేబిస్ వ్యాధి సోకినట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి లిల్లీపుట్ అని విమర్శించారు. ముఖ్యమంత్రులు ప్రధానిని కలవడం రాజ్యాంగ హక్కని…అన్ని రాష్ట్రాల సీఎంలు పీఎంను కలుస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు ప్రధానిని కలుస్తున్నారని తెలిపారు.

మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్నప్పుడు అప్పుడు గుజరాత్ సీఎం మోడీ కూడా అనేక సార్లు కలిశారని గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా మోడీని రాహుల్ గాంధీ కిస్ ఇచ్చారని.. మరి అదేం బంధమని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చైనా రాయబారిని ఎందుకు కలిశారు? చైనాతో రాహుల్ కుమ్మక్కు అయ్యారా? అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలకు అజ్ఞానం ఎక్కువైందన్నారు.

ఎంఐఎం టికెట్లు కేసీఆర్ డిసైడ్ చేస్తే – కాంగ్రేస్ టికెట్లు చంద్రబాబు డిసైడ్ చేస్తారా? అని ప్రశ్నించారు. గాంధీ భవన్ గ్లోబెల్స్ ప్రచారం- గాసిప్స్ అడ్డాగా మారిందని విమర్శించారు. టీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం కాదు.. ప్రజల సంక్షేమ బంధం అన్నారు. పీఎంతో 61అంశాలపై చర్చ జరుపొచ్చని రాజ్యాంగంలోనే ఉందని గుర్తుచేశారు.

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదన్నారు. సీఎం- పీఎంను ఎందుకు కలుస్తారో తెల్వకుండా రేవంత్ రెడ్డి బక్వాజ్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కి దమ్ము ఉంటే హుజురాబాద్ లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించాలన్నారు. బండి సంజయ్ సీఎంను తిట్టడం తప్ప- బీజేపీ ప్రణాళిక ఏంటో చెప్పడం లేదని పేర్కొన్నారు.