Telangana Paddy Issue : ధాన్యం దంగల్.. కేంద్ర మంత్రితో భేటీ కానున్న టీఆర్ఎస్ ఎంపీలు

ఢిల్లీకి చేరిన టీఆర్‌ఎస్‌ మంత్రులు.. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్నారు.

Paddy

TRS MPs To Meet Piyush Goyal : ధాన్యం దంగల్‌లో మొదటి అడుగు పడబోతోంది. ఢిల్లీకి చేరిన టీఆర్‌ఎస్‌ మంత్రులు.. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్నారు. యాసంగి పంట, ధాన్యం కొనుగోలు అంశంపై మాట్లాడనున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కేకే ఆధ్వర్యంలో ఎంపీలు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ ను కలవనున్నార. సమావేశంలో తెలంగాణ మంత్రులు కూడా ఉండనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, పలువురు ఎంపీలున్నారు.

Read More : CM KCR : ధాన్యం కొనుగోలు సేకరణ.. తెలంగాణ ఉద్యమాన్ని మించి పోరాటం – కేసీఆర్

ధాన్యం సేకరణపై దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని, తెలంగాణ నుంచి వచ్చే పూర్తి ధాన్యాన్ని కేంద్రమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరునున్నారు. బియ్యంతో సంబంధం లేకుండా పంజాబ్ లో మాదిరిగా పుర్తి స్థాయిలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే.. భవిష్యత్ కార్యాచరణకు అనుగుణంగా ముందుకు వెళ్తామంటున్నారు. రైతుల కోసం ఎలాంటి పోరాటానికి అయినా సిద్ధమని, కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామని హస్తిన బాటపట్టారు. కేంద్రం రా రైస్ కొంటామని ఇప్పటికే ప్రకటించగా.. కేంద్ర మంత్రిని కలిసి దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేయనున్నారు.

Read More : Paddy Politics : వరి ధాన్యం వార్-ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం సేకరించేందుకు ఒప్పుకుంటే ధాన్యాన్ని బియ్యంగా మార్చి అప్పగిస్తామని మంత్రులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల ఏకరాలలో పండించిన వరి ధాన్యం.. కేంద్రం కొనుగులు చేయాలని డిమాండ్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం నుంచి సానుకూలంగా స్పందన రాకపోతే ఏం చేయాలో సీఎం ఇప్పటికే నిర్ణయించారని మంత్రులు తెలిపారు. దానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే తెలంగాణ మంత్రులు ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్న విధంగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలుపై క్లారిటీ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది టీఆర్ఎస్.