CM KCR : ధాన్యం కొనుగోలు సేకరణ.. తెలంగాణ ఉద్యమాన్ని మించి పోరాటం – కేసీఆర్

కేంద్రం నుంచి స్పందన రాకపోతే...ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తాము తీర్మానం చేయడం జరిగిందన్నారు. పోరాటాలు చేయడం టీఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య అని...

CM KCR : ధాన్యం కొనుగోలు సేకరణ.. తెలంగాణ ఉద్యమాన్ని మించి పోరాటం – కేసీఆర్

Kcr Delhi Tour

Paddy Fight : కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెడీ అయిపోయారు. ప్రధానంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఆయన పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని.. లేనిపక్షంలో ఉద్యమానికి సిద్ధమౌతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. 2022, మార్చి 21వ తేదీ సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ (TRSLP) సమావేశం జరిగింది. వరి ధాన్యం కొనుగోలుతో పాటు.. ఇతర రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Read More : Telangana Paddy : వన్ నేషన్..వన్ ప్రొక్యూర్‌‌మెంట్ ఉండాలి..అన్నీ రాష్ట్రాలకు ఒకే పాలసీ ఉండాలి – సీఎం కేసీఆర్ డిమాండ్

ధాన్యం కొనుగోలు విషయంలో పంజాబ్ రాష్ట్రానికి అనుసరిస్తున్న విధానాన్ని తెలంగాణ నుంచి సేకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి వెళుతారని అక్కడ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కేంద్రం నుంచి స్పందన రాకపోతే…ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తాము తీర్మానం చేయడం జరిగిందన్నారు. పోరాటాలు చేయడం టీఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య అని, తెలంగాణ ఉద్యమస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. పంచాయతీలు, మున్సిపాల్టీల్లోనూ తీర్మానాలు చేసి ప్రధానికి పంపడం జరుగుతుందన్నారు. ధాన్యాన్నే కేంద్రం సేకరించాలి.. తర్వాత ఎలా కావాలో అలా మార్చుకోవాలన్నారు.

Read More : KCR Press Meet Live : పంజాబ్ లెక్కనే మా వడ్లు కొనాలి.. కశ్మీర్ ఫైల్స్ ఓ దిక్కుమాలిన వ్యవహారం-కేసీఆర్

టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో బీజేపీపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో సమస్యలే లేనట్లు బీజేపీ ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు. జాతీయ అంశాలను తప్పుదోవపట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కేసీఆర్.. కమలం పార్టీ ట్రాప్‌లో పడొద్దంటూ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా వివాదం సృష్టించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. టీఆర్ఎస్ఎల్పీ భేటీలో అనేక అంశాలను ప్రస్తావించన కేసీార్.. తెలంగాణ వ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని చేయాలని నిర్ణయించారు.