Telangana Paddy : వన్ నేషన్..వన్ ప్రొక్యూర్‌‌మెంట్ ఉండాలి..అన్నీ రాష్ట్రాలకు ఒకే పాలసీ ఉండాలి – సీఎం కేసీఆర్ డిమాండ్

వన్ నేషన్.. వన్ పాలసీ ఉన్నట్లే.. వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్ మెంట్ ఉండాలని, అన్ని రాష్ట్రాలకు ఒకే పాలసీ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

Telangana Paddy : వన్ నేషన్..వన్ ప్రొక్యూర్‌‌మెంట్ ఉండాలి..అన్నీ రాష్ట్రాలకు ఒకే పాలసీ ఉండాలి – సీఎం కేసీఆర్ డిమాండ్

Cm Kcr On Paddy Procurement

Paddy Procurement : వన్ నేషన్.. వన్ పాలసీ ఉన్నట్లే.. వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్ మెంట్ ఉండాలని, అన్ని రాష్ట్రాలకు ఒకే పాలసీ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. యాసంగిలో వచ్చిన వరి ధాన్యాన్ని మొత్తాన్ని కొనుగోలు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇది అన్నదాతల జీవన్మరణ సమస్య అని, కాలికి వేస్తే వేలికి.. వేలికి వేస్తే కాలికి ముడిపెట్టడం సరికాదన్నారు. పంజాబ్ తరహాలో తెలంగాణ నుంచి పూర్తిస్థాయిలో కేంద్రం ధాన్యం సేకరించాలన్నారు. పంజాబ్ రాష్ట్రంలో రెండు సీజన్ లలో ధాన్యం, గోధుమలు కేంద్రం కొంటోందన్నారు. ఈ విషయంలో మంత్రులు, ఎంపీలు 2022, మార్చి 22వ తేదీ మంగళవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తారని తెలిపారు. 2022, మార్చి 21వ తేదీ సోమవారం టీఆర్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, ఇతర రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

Read More : KCR Press Meet Live : పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ కేంద్రం వరి కొనాలి-కేసీఆర్

పార్లమెంట్ సమావేశాల్లో నిలదీయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. చాలా సుదీర్ఘమైన చర్చ అనంతరం…రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగిందన్నారు. మంత్రులు, పార్లమెంట్ బృందం ఢిల్లీకి వెళ్లడం జరుగుతుందన్నారు. అక్కడ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. పంట మార్పిడి కింద 25 లక్షలు తగ్గించడం జరిగిందని, ఇప్పుడు 35 లక్షలకు వచ్చిందన్నారు. మూడు లక్షల సీడ్ కోసం ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు.

Read More : Telangana : బీజేపీ ట్రాప్ లో పడొద్దు..ఢిల్లీ వేదికగా రైతుల సమస్యలపై ఉద్యమం చేద్దాం..కేంద్రం మెడలు వంచుదాం : కేసీఆర్

30 లక్షల ఎకరాల్లో వరిని అమ్మాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్ సెక్యూర్టీ విషయంలో అన్నీ దేశాలు స్వావలంబన ఉండాలని కోరుకుంటాయన్నారు. ఫుడ్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ అని, ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆహారానికి ఇబ్బంది కలగవద్దన్నారు. ధాన్యం సేకరించే బాధ్యత కేంద్రానిదేనని, ఎక్కువ పంట వస్తే.. నష్టం వస్తే కేంద్రం భరించాల్సిందన్నారు. దేశంలో ఒకే పాలసీ ఉండాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పంజాబ్ రాష్ట్రంలో చాలా ఉద్యమాలు జరిగాయని తెలిపారు. ఆ రాష్ట్రం నుంచి వంద శాతం కేంద్రం తీసుకుంటుందన్నారు. వెంటనే తాము డిమాండ్ చేస్తున్నట్లుగా కేంద్రం సానుకూలంగా స్పందించాలని సీఎం కేసీఆర్ కోరారు.