Paddy Politics : వరి ధాన్యం వార్-ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

తెలంగాణలో పాలిటిక్స్‌ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. ఆ డోస్‌ మరింత పెరగనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.

Paddy Politics : వరి ధాన్యం వార్-ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

Cm Kcr On Paddy Procurement

Paddy Politics :  తెలంగాణలో పాలిటిక్స్‌ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. ఆ డోస్‌ మరింత పెరగనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను మరోసారి టార్గెట్ చేసేందుకు సీఎం కేసీఆర్‌ రెడీ అయ్యారు. ఢిల్లీ నుంచి గల్లీస్థాయిలో పోరాటానికి సిద్ధమవుతున్నారు గులాబి బాస్‌.

కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్‌. వరి ధాన్యం కొనుగోళ్ల అంశంపై మరోసారి రాజకీయం చేసేందుకు రెడీ అయ్యారు. ధాన్యం కొంటారా లేదా అంటూ ఈ రోజు ఢిల్లీకి పయనం అవుతున్నారు. ధాన్యం కొనేదాకా పోరాటం ఆపేది లేదని ఇప్పటికే పార్టీ శ్రేణులకు చెప్పిన బీజేపీపై పూర్తిస్థాయిలో సమరశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు.

తెలంగాణలో వరికోతలు మొదలయ్యాయి. తిండిగింజలు, సొంత అవసరాలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకున్నవి గాక.. 45-50 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని ప్రభుత్వ అంచనా. ఈ ధాన్యాన్నంతా గోదాముల్లో నిల్వ చేయడం అసాధ్యం. రాష్ట్రానికి ఎఫ్‌సీఐ తరహా సంస్థ లేదు. ట్రాన్స్‌పోర్ట్‌ చేయడం కూడా కష్టమైన పని. ఆ భారం నెత్తిన వేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. వానాకాలం ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో సై అంటూ నిరసనలు చేపట్టిన టీఆర్ఎస్…. యాసంగి ధాన్యం కొనుగోళ్లపైనా బీజేపీని ఢీకొట్టేందుకు సిద్దమవుతోంది.

యాసంగిలో వరిసాగు చేస్తే ధాన్యం కొనుగోలు బాధ్యత తమది కాదని రాష్ట్ర ప్రభుత్వం ముందే రైతులకు తేల్చిచెప్పింది. అయినా రైతులు పెద్దసంఖ్యలో వరిసాగు చేశారు. దీంతో యాసంగి ధాన్యం కూడా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తోంది రాష్ట్రప్రభుత్వం. దీనిపై ఢిల్లీ స్థాయిలో ఆందోళనకు సిద్దమవుతోంది. ఈరోజు తెలంగాణభవన్‌లో జరిగే సమావేశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించనున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో నిరసనలకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అలాగే పార్లమెంట్‌లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది టీఆర్ఎస్. ఢిల్లీలో ఆందోళన చేపట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఢిల్లీలో రైతు ఉద్యమాన్ని సమర్ధంగా నిర్వహించిన రాకేశ్‌ టికాయత్‌ను ఇందులో భాగం చేయాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్. ఈరోజు జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లనుంది. కేంద్ర మంత్రులు, ప్రధానిని కలసి ధాన్యం కొనుగోలుపై క్లారిటీ ఇవ్వనున్నారు.

Also Read : Srilanka Economic Crisis : గుడ్డు 35 రూపాయలు… పెట్రోల్ రూ.283….శ్రీలంక సంక్షోభం

ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల టాక్‌ నడుస్తోంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల మూడ్‌ వచ్చేసిందనే చెప్పాలి. మొన్నటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కమలనాథులు తమ నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణనే అని అనౌన్స్‌ చేశారు. దీంతో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు టాక్‌.