Trs
TRS తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నికలో విజయం తమదే అని భావించిన కమలం పార్టీకి..డిపాజిట్ కూడా దక్కలేదు.
సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్ ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోమలు భగత్ 18449 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా..కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ కు 87,254ఓట్లు రాగా…కాంగ్రెస్ కు 68,805 ఓట్లు వచ్చాయి.
గెలుపుపై సంతోషం వ్యక్తం చేసిన నోముల భగత్..తనపై నమ్మకం ఉంచిన సాగర్ ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలే తన గెలుపుకు కారణమని భగత్ తెలిపారు. సీఎం కేసీఆర్,మంత్రులకు పాదాభివందనాలు అని అన్నారు. తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానన్నారు.. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. నెల్లికల్ లిఫ్ట్ ను పూర్తి చేసేలా కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్,మంత్రులకు పాదాభివందనాలు అని అన్నారు.