TRS Plenary : సంపద పెంచాలి.. పేదలకు పంచాలన్నదే కేసీఆర్ లక్ష్యం : హరీశ్ రావు

TRS Plenary : దేశంలో ఏడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధిరేటు పడిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మత కల్లోలాలు సృష్టించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

TRS Plenary : సంపద పెంచాలి.. పేదలకు పంచాలన్నదే కేసీఆర్ లక్ష్యం : హరీశ్ రావు

Trs Plenary Harish Rao Slams Modi Govt On Farmers Issues In Telangana State

Updated On : April 27, 2022 / 1:45 PM IST

TRS Plenary : దేశంలో ఏడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధిరేటు పడిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మత కల్లోలాలు సృష్టించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. నల్లధనం తెస్తామన్నా మోదీ ప్రభుత్వం తేలేదు… కానీ, రైతులకు నల్ల చట్టాలు తెచ్చారరి హరీశ్ రావు విమర్శించారు. బుల్లెట్ రైళ్లను తెస్తామని చెప్పి ఉన్న రైల్వే శాఖను అమ్మేస్తున్నారని ఆరోపించారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలని అనేది కేసీఆర్ లక్ష్యంగా హరీశ్ రావు పేర్కొన్నారు. కేంద్రం మాత్రం పేదలను దంచాలి.. పెద్దలకు పంచాలంటోందని హరీశ్ రావు దుయ్యబట్టారు.

కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు విమర్మించారు. రైతుల ఆదాయాలను పెంచుతామన్న బీజేపీ హామీ ఏమైందని హరీశ్ రావు ప్రశ్నించారు. ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరిచారని ఆయన ధ్వజమెత్తారు. రైతుల ఆదాయం కాదు.. పెట్టుబడి పెంచారని అన్నారు. మరోవైపు.. పెట్రోల్, డీజిల్ పై పన్నులు పెంచుతోంది కేంద్రమా; రాష్ట్రాలా? చెప్పాలన్నారు.

Trs 21st Plenary

Trs 21st Plenary

సెస్‌లు 10శాతం ఉన్నప్పుడే అన్ని రాష్ట్రాలు గగ్గోలు పెట్టాయని చెప్పారు. మోదీ వచ్చిన తర్వాత సెస్ లను 20శాతానికి పెంచారని హరీశ్ రావు మండిపడ్డారు. ఈ ప్రజలను ఇబ్బంది పెడుతూ విధిస్తున్న పన్నుల మోత ఎవరి కోసమో చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు. సెస్ లను వెంటనే రద్దు చేయాలని ప్లీనరీ వేదికగా డిమాండ్ చేస్తున్నామన్నారు. డివిజబుల్ పూల్ లోకి పన్నులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also : CM KCR : దేశానికే ఆదర్శంగా తెలంగాణ : సీఎం కేసీఆర్