ఎంసెట్ పరీక్షలు వాయిదా.. దరఖాస్తు తేదీలు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశాల కోసం నిర్వ హించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20 వరకు ఉన్నత విద్యామండలి పొడిగించింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ సాగుతుండగా.. ఏప్రిల్ 15వ తేదీ వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండడంతో గడువు పొడిగించినట్టు మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు.
ఎంసెట్‌తో పాటే ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పీజీలాసెట్, ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువును పొడిగించినట్లు తెలపారు అధికారులు. ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు మాత్రం ఈనెల 30 వరకు ఉంది. ఇక మే 2న నిర్వహించాల్సిన ఈసెట్, 4, 5, 7, 9, 11 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ పరీక్షలు వాయిదా పడనున్నట్లు చెబుతున్నారు అధికారులు.
ఎంసెట్ గడువు:
ఏప్రిల్ 20: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు
ఏప్రిల్ 22: రూ.500 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్ 24: రూ.1,000 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్ 24 నుంచి మే 1 వరకు: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
ఏప్రిల్ 27: రూ.5,000 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్ 29: రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ
Also Read | ఏపీలో మరో 21మందికి పాజిటివ్: 132కి చేరిన కరోనా కేసులు