TS EAMCET Counselling : తెలంగాణ‌లో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల

ఇంజినీరింగ్ ప్ర‌వేశాల‌కు సంబందించిన‌ కౌన్సెలింగ్  షెడ్యూల్‌ను తెలంగాణ‌ ఉన్నత విద్యామండలి విడుద‌ల చేసింది.

TS EAMCET Counselling : తెలంగాణ‌లో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల

TS Engineering Admissions Counseling Schedule Released

TS EAMCET : తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం టీఎస్ ఎప్‌సెట్ ప‌రీక్ష రాసి అందులో ఉత్తీర్ణులైన విద్యార్థుల‌కు తెలంగాణ‌ ఉన్నత విద్యామండలి శుభ‌వార్త చెప్పింది. ఇంజినీరింగ్ ప్ర‌వేశాల‌కు సంబందించిన‌ కౌన్సెలింగ్  షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. మొత్తం మూడు విడుత‌ల్లో ప్ర‌వేశాల ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది.

తొలి విడుత‌ జూన్‌ 27 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు అధికారులు తెలిపారు. 27 నుంచి ఇంజినీరింగ్ ప్ర‌వేశాల ప్ర‌క్రియ మొద‌లు కానుండ‌గా జూన్ 30న విద్యార్థుల‌కు మొద‌టి విడుత వెబ్ ఆప్ష‌న్ల‌కు అవ‌కాశం ఇచ్చారు. జూలై 12న మొద‌టి విడుత సీట్ల కేటాయింపు ఉండ‌నుంది.

అనంత‌రం రెండో విడుత కౌన్సెలింగ్ ప్ర‌క్రియ జూలై 19 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన సీట్ల కేటాయింపు జూలై 24న చేప‌ట్ట‌నున్నారు. ఇక తుది విడుత కౌన్సెలింగ్ ప్ర‌క్రియ జూలై 30న నిర్వ‌హించ‌నుండ‌గా.. సీట్ల కేటాయింపు ఆగస్టు 5న చేయ‌నున్నారు. మరింత సమాచారం కోసం టీజీఈఏపీసెట్ వెబ్‌సైట్‌ని సందర్శించాలని తెలిపింది.

ఈ ఏడాది జ‌రిగిన టీఎస్ ఎప్‌సెట్ ప‌రీక్ష‌లో ఇంజినీరింగ్ పరీక్షను 2,54,814 మంది విద్యార్థులు రాశారు. ప‌రీక్ష‌కు హాజ‌రైన వారిలో 74.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అబ్బాయిలు 74.38 శాతం, అమ్మాయిలు 75.85 శాతంగా ఉంది.

ముఖ్య‌మైన తేదీలు ఇవే..

– జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ
– జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు
– జూలై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
– జూలై 19 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్
– జూలై 24న ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు
– జూలై 30 నుంచి ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్
– ఆగస్టు 5న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు