Telangana Ramana: జగిత్యాలకు ఎల్ రమణ.. కార్యకర్తలతో మంతనాలు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ మార‌బోతున్నట్లుగా వార్తలు వస్తున్న సమయంలో.. త్వ‌ర‌లో గులాబీ పార్టీలో చేరే విషయంలో జగిత్యాలలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు ఎల్ రమణ.

Ttdp Telangana President Likely To Join Trs

L Ramana(TDP): తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ మార‌బోతున్నట్లుగా వార్తలు వస్తున్న సమయంలో.. త్వ‌ర‌లో గులాబీ పార్టీలో చేరే విషయంలో జగిత్యాలలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు ఎల్ రమణ. జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో రమణ సన్నిహితులు, పార్టీ కార్యకర్తలతో మంతనాలు చేస్తున్నారు రమణ.

తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసి టీఆర్ఎస్‌లో చేరిన వారందరూ రమణకు టీఆర్ఎస్‌లో చేరలంటూ సలహాలు ఇస్తున్నారు. ఇవాళ(13 జూన్ 2021) అందరితో మాట్లాడుతానని చెప్తున్న రమణ.. రేపు ఉదయం మీడియా సమావేశం ఏర్పాటుచేసి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నట్లు ప్రకటించారు.

కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, స్నేహితులను కలిసి క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్‌లో చేరుతున్నారు అనే వార్తల నేపథ్యంలో ఎల్ రమణ జగిత్యాల పర్యటన ప్రాధాన్యత సంతరించుకోగా.. త్వ‌ర‌లో ఎమ్మెల్యేల కోటాలో 6, గ‌వ‌ర్న‌ర్ కోటాలో 1 ఎమ్మెల్సీ స్థానాన్ని భ‌ర్తీ చేస్తే.. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ సీటు ఇస్తారని అంటున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించి సంప్ర‌దింపులు ఒక కొలిక్కి వ‌చ్చాయని చెబుతున్నారు.