Nurse Murder Case: నర్సు శిరీష హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్.. విచారణలో విస్తుపోయే నిజాలు
తుక్కుగూడ నర్సు శిరీష దారుణ హత్య(Nurse Murder Case) కేసును శంషాబాద్ పోలీసులు అతి తక్కువ సమయంలోనే ఛేదించారు.
Tukkuguda nurse sirisha murder case suspect sanaulla arrested
- హైదరాబాద్‌లో నర్సు దారుణ హత్య
- నిందితుడు సనావుల్లాను అరెస్ట్ చేశారు
- ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ
Nurse Murder Case: హైదరాబాద్ నగర శివార్లలోని తుక్కుగూడ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన నర్సు శిరీష దారుణ హత్య కేసును శంషాబాద్ పోలీసులు అతి తక్కువ సమయంలోనే ఛేదించారు. ప్రైమ్‌కేర్ ఆస్పత్రి సమీపంలో నివాసముంటున్న బాధితురాలిపై అత్యంత కిరాతకంగా అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు సనావుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ డీసీపీ రాజేష్ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు జరిపి ఈ కేసును ముగించారు.
Vikarabad Accident: వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన సంచలన నిజాలు:
మృతురాలి గదికి ఆనుకుని ఉన్న మెకానిక్ షాప్‌లో పనిచేసే సనావుల్లా, గది వెనుక కిటికీ నుంచి గత నెల రోజులుగా ఆమెపై కన్నేసి ఉంచాడని దర్యాప్తులో తేలింది. అడల్ట్ కంటెంట్‌కు బానిసైన నిందితుడి ఫోన్లో ఇతర నర్సుల ఫోటోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శిరీషతో(Nurse Murder Case) ఉండే మరో కేరళ నర్స్ ఓనం పండుగకు ఊరెళ్లడంతో, ఆమె ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని లోపలికి చొరబడి ఈ ఘాతకానికి ఒడిగట్టాడు.
సైంటిఫిక్ ఆధారాలు – ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ:
ఘటనా స్థలంలో మృతురాలి ముఖంపై గాయాలు ఉండగా, క్లూస్ టీమ్ నిందితుడి వేలిముద్రలు, వెంట్రుకలను సేకరించింది. నేరాన్ని నిర్ధారించడానికి వీటిని డిఎన్ఏ పరీక్షలకు పంపినట్లు డీసీపీ తెలిపారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా స్పీడ్ ట్రయల్స్ జరిపి నిందితుడికి త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
