నటి శ్రావణి కేసులో RX100 నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

సంచలనం రేపిన టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు, సినీ నిర్మాత అశోక్ రెడ్డి దొరికారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) అశోక్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. శ్రావణి కేసులో అశోక్ ఏ3 నిందితుడిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపగా, అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సిన రోజున ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. అప్పటి నుంచి అశోక్ రెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిలతో పాటు అశోక్ రెడ్డి కూడా కారణం అని పోలీసులు నిర్ధారించారు. దేవరాజ్ రెడ్డికి దూరంగా ఉండాలని సాయికృష్ణారెడ్డి, శ్రావణి కుటుంబసభ్యులతో పాటు నిర్మాత అశోక్ రెడ్డి.. శ్రావణిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపం చెందిన శ్రావణి ఆత్మహత్య చేసుకుంది.
https://10tv.in/i-am-not-in-the-case-of-shravani-proved-beaten-do-an-encounter-sai-krishna-reddy/
ఈ కేసులో దేవరాజ్ రెడ్డిని ఏ3గా, సాయి కృష్ణారెడ్డిని ఏ2గా, అశోక్ రెడ్డిని ఏ3గా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సాయికృష్ణారెడ్డి, దేవరాజ్‌ను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ ఏదో ఒక సందర్భంలో పెళ్లి చేసుకుంటామని శ్రావణిని నమ్మించారని, ఆ తర్వాత యువతిని పలు విధాలుగా వేధించి హింసించారని పోలీసులు తెలిపారు.
ఈ ముగ్గురి బాధలు భరించలేకనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. చనిపోవడానికి ముందు శ్రావణి, దేవరాజ్‌తో చాలా సేపు మాట్లాడినట్లు కాల్ రికార్డు ద్వారా తెలిసిందన్నారు. గతంలో తనను వెంటాడి వేధిస్తున్నట్లు దేవరాజ్ పై శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసిందని డీసీపీ తెలిపారు. కాగా, ఈ కేసులో శ్రావణి తల్లిదండ్రులను నిందితులుగా చేర్చడానికి కుదరదని పోలీసులు స్పష్టం చేశారు.