Amit Shah Visits BJP Dalit Worker Home : బీజేపీ ద‌ళిత కార్య‌క‌ర్త ఇంటికి వెళ్లి అమిత్ షా.. ఉబ్బితబ్బిబైన కుటుంబం

సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేశారు అమిత్ షా. సత్యనారాయణ ఇంటికి వెళ్లిన షా.. కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Amit Shah Visits BJP Dalit Worker Home : మునుగోడులో బీజేపీ స‌భ‌కు హాజర‌య్యేందుకు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… సికింద్రాబాద్‌కు చెందిన బీజేపీ ద‌ళిత కార్య‌క‌ర్త మంద స‌త్య‌నారాయ‌ణ ఇంటికి వెళ్లారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ల‌ను వెంట‌బెట్టుకుని అమిత్ షా…స‌త్య‌నారాయ‌ణ ఇంటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా స‌త్య‌నారాయ‌ణ దంప‌తుల‌ను త‌న పక్క‌నే కూర్చోబెట్టుకున్న అమిత్ షా… వారితో ప‌లు అంశాల‌పై మాట్లాడారు.

స‌త్య‌నారాయ‌ణ కుటుంబం ఇచ్చిన టీ తాగారు అమిత్ షా. తెలంగాణ‌లో టీఆర్ఎస్ స‌ర్కార్ పాల‌నా తీరుపై ఆరా తీశారు. రాష్ట్రంలో ద‌ళితుల‌ను సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేస్తున్నార‌ని అమిత్ షాకు స‌త్య‌నారాయ‌ణ ఫిర్యాదు చేశారు. ద‌ళితుల‌కు ఇచ్చిన హామీల‌ను కేసీఆర్ నెర‌వేర్చ‌డం లేద‌న్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఓడిస్తేనే తెలంగాణ‌లో ద‌ళితుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అమిత్ షా తో అన్నారాయన.

బీజేసీ ఎస్సీ మోర్చా కార్యదర్శి మంద సత్యనారాయణ 30ఏళ్లుగా బీజేపీకి సేవలు అందిస్తున్నారు. అలాంటి సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేశారు అమిత్ షా. సత్యనారాయణ ఇంటికి వెళ్లిన షా.. సత్యనారాయణ కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమ ఇంటికి వచ్చిన షాకు సత్యనారాయణ కుటుంబం ఘన స్వాగతం పలికింది. బీజేపీ సామాన్య కార్యకర్తల పార్టీ అని అమిత్ షా మరోసారి ఈ విషయాన్ని నిరూపించారని ఎస్సీ మోర్చా సెక్రటరీ సత్యనారాయణ. తన వంటి సామాన్య కార్యకర్త ఇంటికి బీజేపీ అగ్రనేత రావడం చాలా ఆనందంగా ఉందన్నారాయన. ఇవాళ తమకు పండగ రోజు అని చెప్పారు. రాష్ట్రంలో దళితులు పడుతున్న సమస్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సత్యనారాయణ చెప్పారు.

 

దళిత కార్యకర్త ఇంటికి అమిత్ షా..