Viral Video: వీడియో వైరల్ కావడం కోసం.. రైలు దూసుకొస్తున్నా పట్టాల మీదే యువకుడు.. చివరకు..

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయితే అదేదో గొప్పగా ఫీలవుతున్నారని సజ్జనార్ చెప్పారు.

Viral Video: వీడియో వైరల్ కావడం కోసం.. రైలు దూసుకొస్తున్నా పట్టాల మీదే యువకుడు.. చివరకు..

Viral Video

Updated On : July 8, 2023 / 3:18 PM IST

Viral Video – Train: రైలు వస్తుంటే పట్టాలమీదే నిలబడ్డాడు ఓ కుర్రాడు. రైలు ఓ అడుగు దూరంగా ఉండగా పట్టాలపై నుంచి పక్కకు జరిగాడు. ఈ తర్వాత కూడా రైలుకి దగ్గరలోనే నిలబడ్డాడు. రైలు కుడి వైపున ఉండే ఓ పార్టు ఆ కుర్రాడికి తలకు తగిలింది. అంతే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ వీడియోను టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ సజ్జనార్ (VC Sajjanar ) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయితే అదేదో గొప్పగా ఫీలవుతున్నారని సజ్జనార్ చెప్పారు. వీడియోలు వైరల్ కావడానికి ఇలాంటి వింత చర్యలకు పాల్పడుతున్నారని, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు. వైరల్ కావడం కంటే ప్రాణాలు ఎంతో విలువైనవని చెప్పారు.

పిచ్చి పిచ్చి పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు. కుటుంబానికి శోకాన్ని మిగల్చవద్దని కోరారు. సజ్జనార్ ఇటీవల ఇటువంటి యాక్సిడెంట్ వీడియోలను తరుచూ పోస్ట్ చేస్తున్నారు. నిర్లక్ష్యం కారణంగా ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో వివరిస్తున్నారు.

Alcohol in Glass Glasses : మద్యాన్ని గాజు గ్లాస్‌ల్లోనే పోసుకుని ఎందుకు తాగుతారు..? ఆసక్తికర కారణాలు..!