Veera Raghava Reddy: వీర రాఘవరెడ్డి గురించి వెలుగులోకి షాకింగ్ విషయాలు.. ఓ సన్యాసి మాటల కారణంగా..
చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడైన రామరాజ్యం వీరరాఘవ రెడ్డిని పోలీసులు ..

Veeraraghava Reddy
Veera Raghava Reddy: చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడైన రామరాజ్యం వీరరాఘవ రెడ్డిని పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇవాళ్టితో రాఘవరెడ్డి కస్టడీ ముగియనుంది. శుక్రవారం నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నారు. కస్టడీ విచారణలో చేసిన నేరాన్ని వీరరాఘవరెడ్డి అంగీకరించారు. దీంతో నేరాంగీకార వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. అయితే, కస్టడీలో కీలక అంశాలను రాఘవరెడ్డి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఆరు లక్షల మందిని రామరాజ్యం ఆర్మీలో రిక్రూట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. ప్రతి గ్రామానికి ఒక సైనికుడిని తన ప్రైవేట్ ఆర్మీకి తయారు చేయాలని ప్లాన్ చేసినట్లు పేర్కొన్నట్లు తెలిసింది.
Also Read: Rajalingamurthy: మేడిగడ్డపై కేసీఆర్, హరీశ్ మీద కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య.. భూ వివాదమే కారణం
వీర రాఘవరెడ్డి మ్యూజికల్ టీచర్ గా నెలకు లక్ష రూపాయలు సంపాదన ఉండేది. అయితే, ఒక సన్యాసి మాటల కారణంగా ఆధ్యాత్మికత వైపు రాఘవరెడ్డి మళ్లాడట. అర్చకుల మద్దతు ఉంటే తన ప్రైవేట్ ఆర్మీ మరింత విస్తరిస్తుందని భావించిన రాఘవరెడ్డి ఇప్పటి వరకు 16 మంది ప్రధాన అర్చకులను కలిసినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. 2014-15లో తన కుమార్తెను రెండో తరగతి నుంచి పైతరగతికి ప్రమోట్ చేయలేదని, ఈ విషయంలో తాను అధికారులు, న్యాయవ్యవస్థతో పోరాడినా న్యాయం దక్కలేదని.. అప్పుడే తాను ఓ కొత్త వ్యవస్థ రూపకల్పన దిశగా ఆలోచన చేసినట్లుగా అతడు వెల్లడించినట్లు సమాచారం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి ప్రస్తావిస్తూ అధికారులతో గతంలో రాఘవరెడ్డి గొడవ పెట్టుకున్నాడట.
Also Read: ఓరి దుర్మార్గుల్లారా.. కుంభమేళాలో మహిళల వీడియోలు ఏంట్రా..! యూపీ పోలీసులు ఏం చేశారంటే..?
తనకు రంగరాజన్ సహకరించి ఉంటే ఇదంతా జరిగి ఉండేదికాదని, అయితే, తాను తయారు చేసిన సభ్యుల ముందే రంగరాజన్ గట్టిగా వాదించడంతో బృందం సభ్యులు ధైర్యం కోల్పోతారనే ఉద్దేశంతోనే దాడికి దిగినట్లు రాఘవరెడ్డి చెప్పినట్లు తెలిసింది. తాను జైలు నుంచి బయటకు వచ్చాక హిందూధర్మ పరిరక్షణ కోసం, దేశ రక్షణ కోసం పనిచేస్తానని చెప్పినట్లు తెలిసింది.