Renuka Chowdhury : త్వరలోనే కేంద్రంలోనూ ఎన్నికలు, ఆ పార్టీ 100 స్థానాల్లో ఓడిపోతుంది, అడ్రస్ లేకుండా పోతుంది- రేణుకా చౌదరి సంచలనం

Renuka Chowdhury : రాష్ట్రంలో ప్రగతి కావాలంటే, నిజంగా ప్రజలకు మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు గుర్తు తెచ్చుకుంటారు.

Renuka Chowdhury : త్వరలోనే కేంద్రంలోనూ ఎన్నికలు, ఆ పార్టీ 100 స్థానాల్లో ఓడిపోతుంది, అడ్రస్ లేకుండా పోతుంది- రేణుకా చౌదరి సంచలనం

Renuka Chowdhury (Photo : Twitter)

Renuka Chowdhury : త్వరలోనే కేంద్రంలో కూడా ఎన్నికలు రానున్నాయని కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 70 నుంచి 100 స్థానాల్లో ఓడిపోతుందని ఆమె జోస్యం చెప్పారు. బీజేపీ గేరు మార్చి బండి సంజయ్ స్థానంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న కిషన్ రెడ్డిని నియమించారని, దీంతో బీజేపీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకునివస్తామని ఆమె చెప్పారు. బీఆర్ఎస్ కారు గుర్తులోని నాలుగు టైర్లలో గాలి పోయిందని, బీఆర్ఎస్ నేతలు కంటి వెలుగులో పరీక్షలు చేయించుకోవాలని ఎద్దేవా చేశారామె.

Also Read..Koonamneni Sambasivarao : తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది : కూనంనేని సాంబశివరావు

నాలులు నెలలోపే ఎన్నికలు వస్తాయి. మధ్యంతర ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు కేంద్ర కూడా ఇందులోకి జంప్ అవ్వొచ్చు. నార్త్ లో గమనిస్తే సుమారు 70 నుంచి 100 సీట్లు బీజేపీ కోల్పోనుంది. పోటీలో ఉండేది రెండు పార్టీలే. అది కాంగ్రెస్, బీఆర్ఎస్. రాహుల్ గాంధీ చెప్పినట్లు బీఆర్ఎస్ గుర్తు కారు నాలుగు టైర్లలో గాలిపోయింది. రాష్ట్రంలో ప్రగతి కావాలంటే, నిజంగా ప్రజలకు మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు గుర్తు తెచ్చుకుంటారు.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ సైతం కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. పేదల కోసం నిర్మిస్తున్నామని చెబుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇళ్ల కోసం పేదలు ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. 2వేలకుపైగా దరఖాస్తులు వస్తే ఇప్పటివరకు నిర్మించిన ఇళ్లు ఆరు వందలే అన్నారు. నిర్మాణాల పరిశీలన కోసం వెళ్లాలని చూస్తే తమను హౌస్ అరెస్ట్ చేయటం సరికాదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సందర్శనకు వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదన్నారు పొన్నం ప్రభాకర్.

Also Read.. Eatala Rajender: మాజీ మంత్రి చంద్రశేఖర్​తో ఈటల భేటీ.. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు

”డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన వాగ్దానం. కానీ, గత 9ఏళ్లుగా కరీంనగర్ పట్టణంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదు. అవి నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని అనుకున్నాం. ఆ ఇళ్లను డ్యామేజ్ చేసేందుకు పోతామని కాంగ్రెస్ పార్టీ పిలుపివ్వలేదు. మాది ప్రజాస్వామిక పార్టీ. మేము సందర్శన చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఎన్నికల ప్రధాన వాగ్దానమైన డబుల్ బెడ్ రూమ్ ఇయ్యకపోతే ప్రభుత్వం ఫెయిల్ అయినట్లే కదా అని చెప్పే ఉద్దేశంతో ఇళ్ల సందర్శనకు పోదాం అంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు” అని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.