Attack On Police: పోలీసులపై గ్రామస్తులు దాడి.. వాహనం ధ్వంసం
ఓ యువకుడి మృతి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో పోలీస్ వాహనం ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి... వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హాసాకొత్తూరు గ్రామానికి చెందిన మాలావత్ సిద్దార్ధ అనే యువకుడు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

Attack On Police
Attack On Police: ఓ యువకుడి మృతి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో పోలీస్ వాహనం ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి… వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హాసాకొత్తూరు గ్రామానికి చెందిన మాలావత్ సిద్దార్ధ అనే యువకుడు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సిద్దార్ధ మృతికి గ్రామానికి చెందిన కనకం రాజేశ్ అనే యువకుడే కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు శుక్రవారం గ్రామంలో ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు.. కానీ గ్రామస్తులు వినలేదు సిద్దార్ధ మృతికి కారణమైన వ్యక్తిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని వారు ఆరోపించారు. పోలీసులు గ్రామాన్ని విడిచి వెళ్లిపోవాలని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై రాళ్ళూ రువ్వారు దీంతో ఇద్దరు కానిస్టేబుల్స్ కి గాయాలు అయ్యాయి.. పోలీస్ వాహనం ధ్వంసమైంది.