వారి వివాహానికి గ్రామస్థులే పెళ్లి పెద్దలయ్యారు

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 07:29 AM IST
వారి వివాహానికి గ్రామస్థులే పెళ్లి పెద్దలయ్యారు

Updated On : March 14, 2020 / 7:29 AM IST

తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని కోల్పోయిన ఆ యువతీ యువకుల పెళ్లికి గ్రామస్థులే పెద్దలయ్యారు. నారాయణపేట జిల్లా మరికల్‌ మండల కేంద్రానికి చెందిన సీమ మాసన్న-మణెమ్మ దంపతులకు లావణ్యతోపాటు చిన్న కూతురు ఉండేది. వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులు పెరిగాయి. కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో 2004లో చిన్న కూతురుతోపాటు దంపతులు 2004లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. లావణ్య.. తాత హన్మంత్‌ ఇంట్లో పెరిగింది. 

కాగా, మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం కొత్లాబాద్‌కు చెందిన ఖాసీంతో లావణ్యకు పెండ్లి నిశ్చయమైంది. ఖాసింకు కూడా తల్లిదండ్రులు లేకపోవడంతో గ్రామస్థులు, కులపెద్దలు కలిసి మాధ్వారా రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం వారికి వివాహం చేశారు.