VRAs : ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్, పే స్కేల్ కూడా అమలు.. వీఆర్ఏలకు సర్కార్ అదిరిపోయే శుభవార్త

ఇక నుంచి వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండబోతున్నారు. వారిందరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్ కూడా ఉండబోతోంది. ఇన్ని రోజుల వీఆర్ఏల కల నిజమైందని చెప్పుకోవచ్చు. VRAs

VRAs : ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్, పే స్కేల్ కూడా అమలు.. వీఆర్ఏలకు సర్కార్ అదిరిపోయే శుభవార్త

VRAs(Photo : Google)

Updated On : July 24, 2023 / 9:31 PM IST

Telangana Government : వీఆర్ఏలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తూ జీవో రిలీజ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పని చేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్దీకరించనున్నట్లు నిన్న సీఎం కేసీఆర్ సమీక్షలో నిర్ణయించారు.

ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీ సిఫార్సులతో నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతల ప్రకారం మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. 61ఏళ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారి వారసులకు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read..VRA System : శాశ్వతంగా వీఆర్ఏ వ్యవస్థ రద్దు, వారసులకు ప్రభుత్వ ఉద్యోగం.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

వీఆర్ఏ వ్యవస్థను పర్మినెంట్ గా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇవాళ వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా సర్దుబాటు చేస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 20వేల 555 వీఆర్ఏలు ఉన్నారు. వీరందరిని మున్సిపల్ శాఖ, రెవెన్యూ, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. అంతేకాదు వారికి పే స్కేల్ కూడా నిర్ణయించింది. వీఆర్ఏలంతా మినిమమ్ క్వాలిఫికేషన్ ఉన్న వారే. కొందరికి 7వ క్లాస్ అర్హత ఉంది. మరికొందరికి డిగ్రీ అర్హత ఉంది. వారి విద్యార్హతలను బట్టి వారి పోస్టులను నిర్ధారిస్తారు.

Also Read..Andhra Pradesh : ఖాతాల్లోకి రూ.15వేలు.. గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఆ రెండు పథకాలకు దరఖాస్తు గడువు పెంపు

కొన్ని చోట్ల 60ఏళ్లు దాటిన వారు కూడా వీఆర్ఏలుగా ఉన్నారు. కారుణ్య నియామకాల కింద వారి కుటుంబాల నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు సర్కార్ జీవో జారీ చేసింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 20వేల మందికి పైగా వీఆర్ఏలు ఉన్నారు. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశాక తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అందుకు ఓకే చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు జీవో కూడా జారీ చేయించారు. ఇక నుంచి వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండబోతున్నారు. వారిందరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్ కూడా ఉండబోతోంది. ఇన్ని రోజుల వీఆర్ఏల కల నిజమైందని చెప్పుకోవచ్చు.