Warangal : యువతి గొంతు కోసిన ఉన్మాది ఎక్కడ ? పోలీసుల గాలింపు
వరంగల్ నగర సీపీ ఐజీ తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలు అనూష నుంచి వివరాలు సేకరించారు. నిందితుడు కోసం...

Warangal
Slitting Woman’s Throat : తెలుగు రాష్ట్రాల్లో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమను ప్రేమించడం లేదని, పెళ్లి చేసుకోవడానికి నిరకరించిందని..ఇతరత్రా కారణాలతో దారుణాలకు తెగబడుతున్నారు. కత్తులతో వారి గొంతులను కోసేస్తూ కట్టుకున్న వారికి క్షోభ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఓ యువతి గొంతు కోశాడో ప్రేమోన్మాది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. పోలీసు శాఖ ఈ కేసును సీరియస్ గా తీసుకుంది.
Read More : Warangal: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై దాడి..
వరంగల్ నగర సీపీ ఐజీ తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలు అనూష నుంచి వివరాలు సేకరించారు. నిందితుడు కోసం పోలీసు బృందాలు వేట ప్రారంభించాయి. వరంగల్ నగరంలోని కాజీపేట హన్మకొండ, వరంగల్ ప్రాంతాలను పోలీసు నిఘా వర్గాలు జల్లెడ పడుతున్నాయి. నిందితుడి ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజ్, సెల్ ఫోన్ డేటాను అనలైజ్ చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఓ శుభకార్యంలో నిందితుడు అజహర్ బాధితురాలికి పరిచయమైంది.
Read More : Hyderabad : మల్కాజ్‌గిరి మహిళ హత్య కేసులో నిందితులు ఎవరు ?
సంఘం మండలం మొండ్రాయి లో బాధితురాలి బంధువుల ద్వారా ఆమె వివరాలు తెలుసుకున్నాడు. తరచూ బాధితురాలిని ఫోన్ లో వేధించడం ప్రారంభించాడు. బాధితురాలు ఫోన్ నెంబర్ మార్చడంతో అజహర్ కక్ష పెంచుకున్నాడు. సంవత్సర కాలంగా బాధితురాలు నిందితుడికి దూరంగా ఉంటోంది. తీవ్ర ఆగ్రహానికి గురైన అజహర్.. ఆమె గొంతుకోసి పారిపోయాడు. సుబేదారి పోలీస్ స్టేషన్ లో నిందితుడు అజహర్ పై కేసు నమోదు చేశారు.