Rains : తెలంగాణలో శనివారం భారీ వర్షాలు
శనివారం తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

Rains
Rains : ఆగస్టు నెల చివరి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. వర్షాల దాటికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల దాటికి పలు చోట్ల నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో వార్త చెప్పింది. రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శనివారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.