Hyderabad (2)
Hyderabad : హైదరాబాద్ నగరంలో ఎప్పుడైనా వర్షం పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. ఏ క్షణమైనా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్లల్లో ఉంటే మంచిదని సూచించారు. సండే కదా అని బయటకు వెళ్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. ఇక శనివారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి నగరంలోని రోడ్లు నదులను తలపించాయి.
Read More : Virata Parvam: ఆలోచనాత్మక పాటతో సింగర్‌గా మారనున్న రానా!
చాదర్ఘాట్ మూసి బ్రిడ్జి మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం సమయంలో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బందంలోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రజలు బయటకు రావద్దని సూచించారు. అత్యవసర సహాయం కోరారు 040-29555500 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.