Vijayashanti : కేసీఆర్ హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం ఏమిటి?: విజయశాంతి

ఒక ఎకరం ఉన్న బీఆర్ఎస్ ఆఫీస్ కు కేసీఆర్ వెళ్తే 25 కార్లు పార్కింగ్ చేసుకునే స్థలం ఉంటుందన్నారు. అయినా ఆఫీస్ కు రాను, అందరు తన ఇంటికే రావాలనే కేసీఆర్ ధోరణి తప్పు అన్నారు.

Vijayashanti – KCR : కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ ముందు ప్రజలు నడిచే రోడ్డుకు కంచెలు వేసే కన్నా స్వంతంగా 25 కార్లు పట్టే ఒక ఇల్లు కేసీఆర్ నిర్మించే ఆలోచన చేయాల్సివుండేదన్నారు. తరాల వరకు ఆ గడి తమదే అనుకొని బహుశా‌ కేసీఆర్ ఆ ఆలోచన చేయకపోవడానికి కారణం కావచ్చని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్‌లో ఉండేది లేదని, సెక్రటేరియట్‌కు వచ్చేది తక్కువనే చెప్పవచ్చు అన్నారు.

ఈ మేరకు విజయశాంతి ట్వీట్ చేశారు. కేసీఆర్ కు ఇప్పుడు మాత్రం హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం ఏమిటని, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉండచ్చ కదా అని ఎద్దేవా చేశారు. అయినా ఒక ఎకరం ఉన్న బీఆర్ఎస్ ఆఫీస్ కు కేసీఆర్ వెళ్తే 25 కార్లు పార్కింగ్ చేసుకునే స్థలం ఉంటుందన్నారు. అయినా ఆఫీస్ కు రాను, అందరు తన ఇంటికే రావాలనే కేసీఆర్ ధోరణి తప్పు అన్నారు.

Prabhas : కల్కి షూటింగ్ సెట్‌లో నెట్‌ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్.. ప్రభాస్ లుక్ చూశారా? గడ్డం, మీసాలతో..

100 సార్లు చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకే ఇప్పటికీ దిక్కులేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ 25 కార్ల ఇంటి గురించి ఎందుకు ఆలోచన చెయ్యాలని ప్రశ్నించారు. ఈ అంశంపై బీఆర్ఎస్ తప్పక ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు