KTR: కేటీఆర్‌ది తప్పు చేయలేదన్న ధీమానా? అరెస్ట్‌కు సిద్ధమయ్యారా.?

కేటీఆర్‌ టార్గెట్‌గా ప్రభుత్వం పావులు కదుపుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

KTR: కేటీఆర్‌ది తప్పు చేయలేదన్న ధీమానా? అరెస్ట్‌కు సిద్ధమయ్యారా.?

KTR

Updated On : November 7, 2024 / 7:53 PM IST

దాసుకోడాలు లేవ్. దాపరికాలు అసలే లేవ్. బయట జరుగుతోన్న ప్రచారమెందుకు..అసలు విషయమేంటో తానే చెప్తానంటూ మీడియా ముందుకు వచ్చేశారు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. తనను అరెస్ట్‌ చేస్తారంటూ జరిగిన ప్రచారంపై సీరియస్‌గానే రియాక్ట్‌ అయ్యారు. గాసిప్స్ పక్కనపెట్టి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాలంటూ సీఎం రేవంత్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అరెస్ట్‌ చేస్తే చేసుకో భయపడేది లేదంటూ తెగేసి చెప్తున్నారు. జైలుకు పంపితే కూడా తగ్గేదేలేదని..ఆరు గ్యారెంటీల మీద వదిలిపెట్టే ముచ్చటే లేదంటున్నారు.

ఫార్ములా ఈ రేస్‌ నిధుల విడుదలపై ప్రభుత్వం వాదన ఎలా ఉన్నా.. కేటీఆర్ వివరణ ఇచ్చుకున్నా..నెక్స్ట్‌ ఏం జరగబోతుందన్న దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. కేటీఆర్‌ టార్గెట్‌గా ప్రభుత్వం పావులు కదుపుతుందని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే పండుగకు ముందే దీపావళి బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి కామెంట్స్ చేశారని అంటున్నారు. అయితే ఫార్ములా ఈ రేసు నిధుల రిలీజ్‌పై కేటీఆర్‌ స్పందించిన తీరు ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. బయట జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చేందుకే కేటీఆర్ మాట్లాడారా..లేక అలర్ట్‌ అయ్యారా అన్నదానిపై డిస్కషన్ జరుగు

తోంది. అధికార పార్టీని డైలమాలో పడేసే వ్యూహంలో భాగంగానే ప్రెస్‌మీట్‌ పెట్టినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు విషయమేంటో చెప్పారా..లేక అరెస్ట్‌పై కంగారు పడి మీడియా ముందుకు వచ్చారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తప్పేం చేయలేదన్నట్లుగా చెప్తూనే..అరెస్ట్‌కు భయపడనంటూ కామెంట్స్‌ చేయడం మరింత చర్చనీయాంశం అవుతోంది. జైలుకు వెళ్లడానికి కూడా రెడీగా ఉన్నానంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కేటీఆర్ మాటల వెనక తప్పు చేయలేదనే ధీమా ఉందా లేక అరెస్ట్‌కు మానసికంగా సిద్ధమయ్యారా అన్నది ఆసక్తికరంగా మారింది.

కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం
ఫార్ములా ఈ రేస్‌ నిధుల విషయంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ డైరెక్టుగా ప్రెస్‌మీట్‌ పెట్టడంతో అసలు విషయమేంటన్న దానిపై చర్చ మొదలైంది. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహించారు. ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు.

దీంతో అప్పుడు మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ రిక్వెస్ట్ చేయడంతో 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన 2వ దఫా రేస్ నిర్వహణకు HMDA రూ.55 కోట్లు FEOకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఆర్థికశాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా ఇస్తారంటూ అధికార కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇదే విషయంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై కేటీఆరే మీడియా ముందుకు వచ్చి అసలు విషయం ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు.

క్లారిటీ ఇచ్చే ప్రయత్నం
ఫార్ములా ఈ రేస్ కోసం స్పాన్సర్లు దొరకలేదంటే..ప్రమోటర్లు దొరికే వరకు తాత్కాలికంగా ప్రభుత్వం తరఫున పెట్టుబడి పెట్టామంటున్నారు కేటీఆర్. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచడానికి ఫార్ములా ఈ రేసు కోసం అర్జెంట్‌గా రూ.55 కోట్లు కట్టాలంటే కట్టామని చెప్పుకొచ్చారు. ఇదంతా HMDAకు తెలియకుండా జరిగిందనడం సరికాదంటున్న కేటీఆర్..నవంబర్ 14న HMDA జీవో కూడా ఇచ్చినట్లు తెలిపారు.

HMDA ఇండిపెండెంట్ బోర్డు అని..HMDA నిర్ణయాలు తీసుకోవాలంటే క్యాబినెట్ ఆమోదం అవసరం లేదంటున్నారు కేటీఆర్. HMDAకు ఛైర్మన్‌గా సీఎం, వైస్ ఛైర్మన్‌గా మున్సిపల్ మినిస్టర్, ఎండీగా మెట్రోపాలిటన్ కమిషనర్ ఉంటారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కావొద్దని ఫార్ములా ఈ రేస్‌కు ఫండ్స్ రిలీజ్ చేయిమని తానే చెప్పానని క్లారిటీ ఇచ్చేలా మాట్లాడారు కేటీఆర్.

సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు.. నిందితులకు ఖాకీల మర్యాదలు..!