KCR Cabinet Sack Minister : కేసీఆర్ కేబినెట్ నుంచి మరో వికెట్ డౌన్?

టీఆర్ఎస్‌లో మరొకరి పదవికి ఎసరు వచ్చిందా? కేసీఆర్ కేబినెట్ నుంచి మరో వికెట్ పడబోతుందా? త్వరలో మరో మంత్రికి ఉద్వాసన తప్పదా? ఓ మంత్రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? అంటే అవుననే అంటున్నాయి...

KCR Cabinet Sack Minister : కేసీఆర్ కేబినెట్ నుంచి మరో వికెట్ డౌన్?

Another Minister To Be Sacked From Kcr Cabinet

Updated On : June 8, 2021 / 9:45 PM IST

KCR Cabinet To Sack Minister  : టీఆర్ఎస్‌లో మరొకరి పదవికి ఎసరు వచ్చిందా? కేసీఆర్ కేబినెట్ నుంచి మరో వికెట్ పడబోతుందా? త్వరలో మరో మంత్రికి ఉద్వాసన తప్పదా? ఓ మంత్రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. కేసీఆర్ కేబినెట్ నుంచి మరో వికెట్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ మంత్రి చుట్టూ నీలినీడలు కమ్ముకుంటుండటం ఈ సందేహాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. హంపిలో జరిగిన టీఆర్ఎస్ ధూంధాంపై అంతటికి ఇప్పుడు సెంటర్ పాయింట్ గా మారింది. కొద్దిరోజుల క్రితమే హంపిలో టీఆర్ఎస్ ధూంధాం నిర్వహించారు.

ఇందులో టీఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ ధూంధాంలో టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. తన ట్వీటుకు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని జోడిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. రేవంత్ ట్వీట్ ఇప్పుడు టీఆర్ఎస్ లో రాజీకీయ దుమారం రేపుతోంది. హంపి ధూంధాంలో పాల్గొన్న నేతల్లో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ హంపి ధూంధాంలో ఏం జరిగింది? ఏం చేశారు అనేది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంకు పూర్తి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ ఇచ్చినట్టు సమాచారం.

గత జనవరి నెలలో కర్నాటకలోని హంపి వేదికగా ఒక బర్త్‌డే పార్టీ జరిగింది. ఆ వేడుకల్లో అనేకమంది ప్రముఖులు, నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కొన్ని రాజకీయ అంశాలపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు కేసీఆర్ దృష్టికి రావడంతో వారు ఎవరు అనేది సీఎం ఆరా తీస్తున్నట్టు సమాచారం . హంపికి సంబంధించి మొత్తం చిట్టా కేసీఆర్ దగ్గర ఉన్నట్టు సమాచారం. వీటిన్నిటి ఆధారంగా మరో మంత్రిపై వేటు తప్పదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. త్వరలో ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా స్థాన చలనం కలిగే అవకాశాలు కనిపిస్తోంది.