Yadadri Temple : యాదాద్రి నరసింహుడి ఖజానాకు రూ. 3,84,933
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 3,84,933 ఆదాయం వచ్చింది.

Yadadri Temple
Yadadri Temple : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 3,84,933 ఆదాయం వచ్చింది. ప్రస్తుతం పండుగ ఉండటంతో భక్తుల రద్దీ కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తుంది. గత వారం ఖజానా ఆదాయం అధికంగా ఉంది.. గత వారంతో పోల్చితే ఈ వారం ఆరంభం నుంచి ఖజానా ఆదాయం తక్కువగానే కనిపిస్తుంది. దసరా, బతుకమ్మ పండుగలు ఉండటంతో భక్తుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. ఇక పండుగ తర్వాత భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు త్వరలో నూతన దేవాలయం ప్రారంభం కానుంది. ఈ విషయాన్నీ మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
చదవండి : యాదాద్రి ఓ అద్భుతం.. వీడియో షేర్ చేసిన కేటీఆర్
ఖజానా ఆదాయ వివరాలను పరిశీలిస్తే
ప్రధాన బుకింగ్ ద్వారా 36,908,
రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 18,900
వేద ఆశీర్వచనం ద్వారా 1,548
నిత్యకైంకర్యాల ద్వారా 400
క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 1,100
వ్రత పూజలతో 5,500
చదవండి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 15,47,185 ఆదాయం
కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 6,200
ప్రసాద విక్రయాల ద్వారా 1,76,010
వాహన పూజల ద్వారా 8.,900
టోల్ గేట్ ద్వారా 620
అన్నదాన విరాళం ద్వారా 19,550
సువర్ణ పుష్పార్చన ద్వారా 44,280
యాదరుషి నిలయం ద్వారా 16,800
పాతగుట్ట నుంచి 7,385
మొత్తంగా ఖజానాకు రూ. 3,84,933 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.