Love Failure : రన్నింగ్ బస్సు దిగి.. హుస్సేన్ సాగర్ లో దూకిన యువకుడు

ప్రేమ విఫలమైందని ఓ యువకుడు రన్నింగ్ బస్సు నుంచి దిగి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. యువకుడిని చూసిన పోలీసులు వెంటనే హుస్సేన్ సాగర్లోకి దిగి యువకుడిని రక్షించారు.

Love Failure : రన్నింగ్ బస్సు దిగి.. హుస్సేన్ సాగర్ లో దూకిన యువకుడు

Love Failure

Updated On : October 1, 2021 / 10:41 AM IST

Love Failure : ప్రేమ విఫలమైందని ఓ యువకుడు రన్నింగ్ బస్సు నుంచి దిగి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. యువకుడిని చూసిన పోలీసులు వెంటనే హుస్సేన్ సాగర్లోకి దిగి యువకుడిని రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలకత్తాకు చెందిన 23 ఏళ్ల యువకుడు మౌలాలిలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు.. విషయం యువతి ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు.

Read More : Kiran Kumar Reddy : మోసగాడు చిక్కాడు.. తిరుపతిలో పట్టుకున్న తెలంగాణ పోలీసులు

దీంతో భయపడిన యువకుడు ఆర్టీసీ బస్సులో వెళ్తూ బస్సు రన్నింగ్ లో ఉండగానే దిగి పరుగున వెళ్లి హుస్సేన్ సాగర్ లో దూకాడు. పోలీసులు అక్కడే ఉండటంతో వెంటనే అతడిని బయటకు తీశారు. అనంతరం రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ కి తీసుకెళ్లి కుటుంబ సభ్యులను పిలిపించిన ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మి కౌన్సిలింగ్‌ నిర్వహించిన అనంతరం వారికి అప్పగించారు. ఆ యువకుడిని కాపాడిన లేక్‌ కానిస్టేబుళ్లు అభిలాష్‌, రాజులను ఇన్‌స్పెక్టర్‌ అభినందించారు.

Read More : Software Employee : భార్యతో గొడవ.. ఓ కారు, నాలుగు బైకులకు నిప్పుపెట్టిన ఐటీ ఉద్యోగి.