పెళ్లిని చెడగొట్టాలని.. లవర్‌కు కాబోయే భర్తను కిడ్నాప్ చేశాడు

పెళ్లిని చెడగొట్టాలని.. లవర్‌కు కాబోయే భర్తను కిడ్నాప్ చేశాడు

Youngster Kidnapped Lovers Fiancee In Hyderabad

Updated On : April 18, 2021 / 7:47 AM IST

Youngster kidnapped: తన లవర్‌కి వేరే వ్యక్తితో పెళ్లి అవుతోంది అనే విషయం తట్టుకోలేక ఓ వ్యక్తి.. ప్రేయసికి కాబోయే భర్తను కిడ్నాప్‌ చేశాడు. హైదరాబాద్‌లోని మైలార్ దేవుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. అబ్బాయి, అమ్మాయి తరఫు వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.

నదీమ్ ఖాన్‌(28) అనే వ్యక్తికి ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరగగా.. ఆ అమ్మాయిని ఇంతకుముందే ఓ యువకుడు ప్రేమించగా.. పెళ్లిని చెడగొట్టాలని ఆ యువకుడు బైక్‌పై వెళ్తున్న నదీమ్‌ను ఆపి కిడ్నాప్‌ చేశాడు. ఈ కిడ్నాప్‌ ఘటనలో అమ్మాయికి ముందుగా తెలుసా? లేదా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే విషయాలపై మైలార్ దేవుపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు.

కిడ్నాప్‌లో యువకుడికి సహకరించి పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిని విచారించి కిడ్నాప్‌ అయిన నదీమ్‌ఖాన్‌ను విడుదల చేయించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.