Ys Sharmila : తాడిపర్తిలో షర్మిల నిరుద్యోగ నిరసన దీక్ష..

నిరుద్యోగులకు బాసటగా YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు షర్మిల మంగళవారం తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపర్తిలో నిరుద్యోగ దీక్షను చేపట్టారు.

Ys Sharmila One day Hunger Strike : నిరుద్యోగులకు బాసటగా YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు షర్మిల మంగళవారం (జూలై 13) తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపర్తిలో నిరుద్యోగ దీక్షను చేపట్టారు. ఈ రోజు తాడిపర్తికి చేరుకున్న షర్మిల.. నిరుద్యోగి కొండల్ ఫ్యామిలీని పరామర్శించి నిరుద్యోగ నిరహార దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. తాడిపర్తిలో కొండల్‌ అనే నిరుద్యోగి నోటిఫికేషన్లు రావడం లేదని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే వరకు.. ప్రతి మంగళవారం రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ఇంటి వద్ద షర్మిల ఒక్క రోజు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. అందులోభాగంగానే వనపర్తి జిల్లాలో అతని ఇంటి వద్ద ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు షర్మిల నిరాహారదీక్ష కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నాయకులు, విద్యార్థులు, యువకులు, కార్య కర్తలు పెద్ద సంఖ్యలో షర్మిల మంగళవారం దీక్షకు హాజరై మద్దతు పలకాలని పార్టీ అడహాక్‌ కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణ వచ్చిన తర్వాత బతుకులు బాగుపడతాయనుకుంటే నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదిక ప్రకారం దాదాపు 2లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఉద్యోగం కోసం వనపర్తి జిల్లాకు చెందిన నిరుద్యోగి కొండల్‌ మంత్రి నిరంజన్‌రెడ్డి చుట్టూ పదే పదే తిరిగి విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు