Group-1 Candidates Protest : అశోక్ నగర్ సిగ్నల్ వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నవిషయం తెలిసిందే.

Group-1 Candidates Protest
Group-1 Candidates Protest : హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నవిషయం తెలిసిందే. శనివారం విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. బండి సంజయ్ వస్తున్నాడనే సమాచారంతో భారీగా గ్రూప్ 1 అభ్యర్థులు అశోక్ నగర్ సిగ్నల్ వద్దకు చేరుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ నగర్ సిగ్నల్ వద్దకు చేరుకున్న బండి సంజయ్.. గ్రూప్1 బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అభ్యర్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.
Also Raed: Minister Tummala: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు..
గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేసేంత వరకు కదిలేది లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు. అశోక్ చౌరస్తా హాస్టళ్ల నుండి విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసుల నిర్బంధాలను అధిగమించి అశోక్ నగర్ చౌరస్తాకు బాధితులు పెద్ద సంఖ్యలో రావడంతోపాటు చలో సచివాలయం ర్యాలీకి బండి సంజయ్ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సచివాలయంకు వెళ్తున్న బండి సంజయ్ ను ఇందిరా పార్కు వద్ద పోలీసులు అరెస్టు చేశారు.