Minister Tummala: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు..

రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పారు.

Minister Tummala: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు..

Minister Tummala Nageswara Rao

Updated On : October 19, 2024 / 1:49 PM IST

Minister Tummala Nageswara Rao : ఖరీఫ్ రైతులకు రైతు భరోసాపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వలేమని పేర్కొన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక తరువాత రైతు భరోసా ఇస్తామని తుమ్మల చెప్పారు.

Also Read : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ గుత్తా.. నల్గొండ జిల్లాలో నయా వార్

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తుమ్మల విమర్శలు చేశారు. గత ప్రభుత్వం పంట వేయని భూములకు రూ. 25వేల కోట్లు ఇచ్చిందని అన్నారు. సన్నధాన్యం పండించిన ప్రతీ రైతుకు రూ. 500 బోనస్ ఇస్తామని తుమ్మల చెప్పారు. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ముఖ్యమంత్రి రుణమాఫీ అంశాన్ని తన భుజాన వేసుకున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. 42 బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని రుణమాఫీ చేశామని తుమ్మల చెప్పారు. 20లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది.. రెండు లక్షలపైన ఉన్న డబ్బులు కడితే రుణమాఫీ అవుతుందని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు లేని మూడు లక్షల మందికి డిసెంబర్ లో కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా రుణమాపీ చేస్తామని తుమ్మల చెప్పారు.