PAK vs SA: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం..
శుక్రవారం చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వికెట్ తేడాతో విజయం సాధించింది.

icc cricket world cup 2023 today pakistan vs south africa live match
దక్షిణాఫ్రికా విజయం..
మార్‌క్రమ్ (91; 93 బంతుల్లో 7 ఫోర్లు, 3సిక్సర్లు) రాణించడంతో 271 లక్ష్యాన్ని సౌతాఫ్రికా 47.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది.
లుంగి ఎంగిడి ఔట్..
హరీస్ రవూఫ్ బౌలింగ్‌లో లుంగి ఎంగిడి(4) ఔట్ అయ్యాడు. దీంతో 45.3వ ఓవర్‌లో 260 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అంతకముందు షహీన్ అఫ్రీది బౌలింగ్ లో గెరాల్డ్ కొయిట్జీ (10) ఔట్ అయ్యాడు.
మార్‌క్రమ్ ఔట్..
దక్షిణాఫ్రికా మరో వికెట్ కోల్పోయింది. ఉసామా మీర్ బౌలింగ్‌లో మార్‌క్రమ్ (91; 93 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) బాబర్ ఆజాం క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో 40.2వ ఓవర్‌లో 250 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.
మార్కో జాన్సెస్ ఔట్..
హరీస్ రవూఫ్ బౌలింగ్ లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన మార్కో జాన్సెన్ (20; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) అదే ఊపులో మరో భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. దీంతో 36.5వ ఓవర్‌లో 235 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది.
మిల్లర్ ఔట్..
దక్షిణాఫ్రికా మరో వికెట్ కోల్పోయింది. షహీన్ అఫ్రీది బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ (29; 33 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రిజ్వాన్ చేతికి చిక్కాడు. దీంతో 33.1వ ఓవర్‌లో 206 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది.
క్లాసెన్ అవుట్.. 4వ వికెట్ డౌన్
136 పరుగుల వద్ద సౌతాఫ్రికా 4వ వికెట్ నష్టపోయింది. హెన్రిచ్ క్లాసెన్ 12 పరుగులు చేసి అవుటయ్యాడు. డుసెన్ 21 చేసి మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. 27 ఓవర్లలో 168/4 స్కోరుతో దక్షిణాఫ్రికా ఆట కొనసాగిస్తోంది.
బావుమా అవుట్.. రెండో వికెట్ డౌన్
67 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ నష్టపోయింది. బావుమా 24 పరుగులు చేసి అవుటయ్యాడు. 17 ఓవర్లలో 115/2 స్కోరుతో దక్షిణాఫ్రికా ఆట కొనసాగిస్తోంది.
డికాక్ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
34 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ నష్టపోయింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 24 పరుగులు చేసి షాహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో అవుటయ్యాడు. 5 ఓవర్లలో 38/1 స్కోరుతో దక్షిణాఫ్రికా ఆట కొనసాగిస్తోంది.
ఫస్ట్ ఓవర్ లో 5 వైడ్లు
271 పరుగుల టార్గెట్ తో సౌతాఫ్రికా బ్యాటింగ్ కు దిగింది. పాకిస్థాన్ బౌలర్ ఇఫ్తీకర్ అహ్మద్ మొదటి ఓవర్ లో ఏకంగా 5 వైడ్లు వేశాడు. దీంతో తొలి ఓవర్ లో 11 పరుగులు వచ్చాయి.
పాకిస్థాన్ ఆలౌట్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
దక్షిణాఫ్రికాకు పాకిస్థాన్ 271 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటయింది. బాబర్ ఆజం(50) సౌద్ షకీల్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. షాదాబ్ ఖాన్ 43, మహ్మద్ రిజ్వాన్ 31, మహ్మద్ నవాజ్ 24, ఇఫ్తీకర్ అహ్మద్ 21, ఇమామ్-ఉల్-హక్ 12 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షమ్సీ 4, మార్కో జాన్సన్ 3, గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు పడగొట్టారు. లుంగి ఎన్గిడి ఒక వికెట్ తీశాడు.
నవాజ్ అవుట్.. 9వ వికెట్ డౌన్
268 పరుగుల వద్ద పాకిస్థాన్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ నవాజ్ 24 పరుగులు చేసి అవుటయ్యాడు. 45 ఓవర్లలో 267/8 స్కోరుతో పాకిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.
ఆఫ్రిది అవుట్.. 8వ వికెట్ డౌన్
259 పరుగుల వద్ద పాకిస్థాన్ 8వ వికెట్ కోల్పోయింది. షహీన్ ఆఫ్రిది(2) అవుటయ్యాడు. 45 ఓవర్లలో 267/8 స్కోరుతో పాకిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.
షకీల్ హాఫ్ సెంచరీ.. ఏడో వికెట్ కోల్పోయిన పాక్
240 పరుగుల వద్ద పాకిస్థాన్ ఏడో వికెట్ కోల్పోయింది. సౌద్ షకీల్ హాఫ్ సెంచరీ(52) చేసి అవుటయ్యాడు. 44 ఓవర్లలో 259/7 స్కోరుతో పాకిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.
Excellent batting from @saudshak as he brings up his third ODI half-century ?#PAKvSA | #DattKePakistani | #CWC23 pic.twitter.com/dVvrCFxxmi
— Pakistan Cricket (@TheRealPCB) October 27, 2023
200 దాటిన పాకిస్థాన్ స్కోరు
పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. 39 ఓవర్లలో 220/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. సౌద్ షకీల్ 45, షాదాబ్ ఖాన్ 40 పరుగులతో ఆడుతున్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన పాక్
141 పరుగుల వద్ద పాకిస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది. బాబర్ ఆజం 50 పరుగులు చేసి తబ్రైజ్ షమ్సీ బౌలింగ్ లోఅవుటయ్యాడు. 30 ఓవర్లలో 151/5 స్కోరుతో పాకిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.
బాబర్ ఆజం హాఫ్ సెంచరీ
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం హాఫ్ సెంచరీ చేశాడు. 64 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో అర్ధశతకం పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 31వ హాఫ్ సెంచరీ. గత మ్యాచ్ లోనూ అతడు హాఫ్ సెంచరీ చేశాడు. పాకిస్థాన్ 27 ఓవర్లలో 136/4 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
31st ODI half-century for @babarazam258 ?#PAKvSA | #DattKePakistani pic.twitter.com/mA6sTKgCEn
— Pakistan Cricket (@TheRealPCB) October 27, 2023
నాలుగో వికెట్ కోల్పోయిన పాక్
129 పరుగుల వద్ద పాకిస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇఫ్తీకర్ అహ్మద్ 21 పరుగులు చేసి తబ్రైజ్ షమ్సీ బౌలింగ్ లోఅవుటయ్యాడు. బాబర్ ఆజం 47 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
రిజ్వాన్ అవుట్.. మూడో వికెట్ డౌన్
86 పరుగుల వద్ద పాకిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులు చేసి గెరాల్డ్ కోయెట్జీ బౌలింగ్ లోఅవుటయ్యాడు. పాకిస్థాన్ 17 ఓవర్లలో 88/3 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. బాబర్ ఆజం (27), ఇఫ్తీకర్ అహ్మద్(1) క్రీజ్ లో ఉన్నారు.
హక్ అవుట్.. రెండో వికెట్ డౌన్
పాకిస్థాన్ 38 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇమామ్-ఉల్-హక్ 12 పరుగులు చేసి మార్కో జాన్సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. పాకిస్థాన్ 15 ఓవర్లలో 84/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. బాబర్ ఆజం (25), రిజ్వాన్ (30) క్రీజ్ లో ఉన్నారు.
షఫీక్ అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ 20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అబ్దుల్లా షఫీక్ 9 పరుగులు చేసి మార్కో జాన్సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. పాకిస్థాన్ 5 ఓవర్లలో 28/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
పాకిస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్
పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. తమకు ఇప్పుడు ప్రతి మ్యాచ్ కీలకమే కాబట్టి దానిపైనే దృష్టి పెడుతున్నామని తెలిపాడు. ఫీల్డింగ్‌తో సహా అన్ని విభాగాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. అనారోగ్యంతో ఉన్న హసన్ అలీ స్థానంలో వసీమ్ జూనియర్ వచ్చాడని వెల్లడించాడు. ఉసామా మీర్ స్థానంలో నవాజ్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు దక్షిణాఫ్రికా రెగ్యులర్ బావుమా మళ్లీ బరిలోకి దిగాడు. సౌతాఫ్రికా టీమ్ లో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. రీజా హెండ్రిక్స్, రబడ, లిజాద్ విలియమ్స్ ఈరోజు మ్యాచ్ లో లేరు. తబ్రిజ్ షమ్సీ, ఎన్గిడి జట్టులోకి వచ్చారు.
? PLAYING XI & TOSS ?
Pakistan win the toss and elect to bat first ?
Two changes to our team ?#PAKvSA | #DattKePakistani | #CWC23 pic.twitter.com/mcTiTTzVau
— Pakistan Cricket (@TheRealPCB) October 27, 2023
తుది జట్లు
పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాహీన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రౌఫ్
దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎన్గిడి
పాకిస్థాన్ కు చావోరేవో
ODI World Cup 2023 PAK vs SA: వన్డే ప్రపంచకప్ లో 26వ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటివరకు రెండు జట్లు ఐదేసి మ్యాచ్ లు ఆడాయి. సౌతాఫ్రికా 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. రెండింటిలో మాత్రమే గెలిచిన పాకిస్థాన్ ఆరో స్థానంలో నిలిచింది. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం పాకిస్థాన్ కు తప్పనిసరి.
ఇంగ్లండ్ శ్రీలంక మ్యాచ్ ముందు వరకు ఐదో స్థానంలో ఉన్న పాకిస్థాన్.. తర్వాత 6వ స్థానానికి పడిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించి ఐదో స్థానానికి శ్రీలంక దూసుకువచ్చింది. దీంతో పాకిస్థాన్ 5 నుంచి 6వ స్థానానికి వచ్చింది. తమ తదుపరి మ్యాచ్ ల్లో మంచి రన్ రేటుతో గెలవడంతో పాటు.. ఇతర మ్యాచ్ ల ఫలితాలపై పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. పాయింట్ల పట్టికలో భారత్(1) దక్షిణాఫ్రికా(2), న్యూజిలాండ్(3), ఆస్ట్రేలియా(4) మొదటి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Pakistan look to get their #CWC23 campaign back on track against an in-form South Africa unit ?#PAKvSA pic.twitter.com/OSLvyymrTr
— ICC Cricket World Cup (@cricketworldcup) October 27, 2023
అంత ఈజీ కాదు
టోర్ని ఆరంభం నుంచి దూకుడు మీద ఉన్న దక్షిణాఫ్రికాను ఓడించడం అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఓడిన ఒక్క మ్యాచ్ లో తప్ప మిగతా అన్ని మ్యాచుల్లోనే సఫారీ టీమ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిందని గుర్తు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లోనూ గెలిచి సెమీస్ కు చేరువ కావాలని సౌతాఫ్రికా భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్థాన్ ఎలాగైనా ఈరోజు మ్యాచ్ లో గెలవాలని పట్టుదలతో ఉంది.