షుగర్ పేషెట్స్ జామపండ్లు తింటున్నారా? అయితే జాగ్రత్తలు తప్పవు.. ముందు ఇది తెలుసుకోండి

ఈ సమస్య ఉన్నవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తిన్న ప్రతి పదార్థం రక్తంలోని గ్లూకోజ్ లెవెల్‌పై ప్రభావం చూపుతుంది.

షుగర్ పేషెట్స్ జామపండ్లు తింటున్నారా? అయితే జాగ్రత్తలు తప్పవు.. ముందు ఇది తెలుసుకోండి

Is it good to eat guavas with sugar? What are the risks?

Updated On : July 15, 2025 / 3:02 PM IST

ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్నవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తిన్న ప్రతి పదార్థం రక్తంలోని గ్లూకోజ్ లెవెల్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి, ముందుజాగ్రత్తలు చాలా అవసరం. ఇక పండ్లలో జామపండ్లను మాత్రం షుగర్ పేషేంట్స్ విశేషంగా తింటారు. కారణం ఏంటి అనేది చాలా మంది తెలియదు. ఎవరో చెప్పారు తినాలి అంతే. మరి నిజంగా షుగర్ పేషేంట్స్ జామపండ్లను తినవచ్చా? తింటే ఏమవుతుంది? ఎంతవరకు తినవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

జామపండ్లలో ఉండే పోషకాల వివరాలు:

క్యాలరీలు: తక్కువ

షుగర్ కంటెంట్: తక్కువ (బాగా పండిన జామపండ్లలో కొద్దిగా ఎక్కువ)

ఫైబర్: అధికంగా ఉంటుంది

విటమిన్ C: అధికంగా ఉంటుంది

యాంటీఆక్సిడెంట్లు: అధికంగా ఉంటుంది

షుగర్ పేషెంట్స్‌ జామపండు తినడం వల్ల కలిగే లాభాలు:

1.బ్లడ్ షుగర్ కంట్రోల్
జామపండులోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మందగింపజేస్తుంది. కాబట్టి, గ్లూకోజ్ రక్తంలోకి విడుదలయ్యే వేగం తగ్గుతుంది. ఇది షుగర్ లెవెల్స్‌ను స్థిరంగా ఉండేలా చేస్తుంది.

2.గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం
జామపండ్ల GI (Glycemic Index) చాలా తక్కువగా. అది కూడా 12 నుంచి 14 వరకు ఉండవచ్చు. కాబట్టి, ఇవి రక్తంలో షుగర్‌ను వేగంగా పెంచవు.

3.యాంటీఆక్సిడెంట్లు అధికం:
జామపండ్లలో విటమిన్ C, లైకోపీన్, పాలిఫినాల్స్ లాంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ కారణంగా ఏర్పడే సెల్యులర్ డామేజ్‌ను తగ్గిస్తాయి.

4.ఇన్సులిన్ ఫంక్షన్‌కు మద్దతు:
జామపండ్లతో కాదు జమ ఆకులతో కూడా ఆరోగ్యమే. కొన్ని అధ్యయనాల ప్రకారం జామపండు ఆకులలో ఉండే విటమిన్లు, ఫైటోకెమికల్స్ ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

జామపండ్లు తినడంలో ఉండే నష్టాలు:

1.అధికంగా తినడం ప్రమాదకరం:
బాగా పండిన జామపండ్లలో సహజంగా ఉండే ఫ్రక్టోస్ గ్లూకోజ్‌ స్థాయిలను పెంచే ప్రమాదం ఉంది. కాబట్టి, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది.

2.వేడి ఆహారంతో జామపండ్లు తినకూడదు:
జామపండ్లను వేడి ఆహారంతో తినడం మంచిది కాదు. వేడి పదార్థాలతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

3.అమ్మాయిలు, పేగు సమస్యలున్నవారు ఎక్కువగా తినకూడదు:
బీజాలతో కూడిన జామపండ్లు ఎక్కువ తింటే కొందరికి అజీర్ణం, bloating సమస్యలు రావొచ్చు. అమ్మాయిల్లో ముఖ్యంగా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

జామపండ్లు ఎలా తినాలి? ఎంత తినాలి? ఎప్పుడు తినాలి?

  • రోజుకి 1 నుంచి 2 మధుర జామపండ్లు తినవచ్చు.
  • మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయం జామపండ్లు తినడానికి ఉత్తమం.
  • పండ్లు పూర్తిగా పండినవి కాకుండా, కొద్దిగా ముద్దగా ఉండేవి తీసుకోవడం మంచిది.
  • తినేటప్పుడు బీజాలు తీసేసి తినటం మంచిదే.

జామపండ్లు షుగర్ పేషెంట్స్‌కి ఎంతో ఆరోగ్యకరమైన ఎంపిక. ఇవి బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో సహాయపడతాయి, యాంటీఆక్సిడెంట్ల వలన చాలా లాభాలు కలుగుతాయి. కానీ మితంగా తినాలి.